హోమ్ క్వారెంటైన్ లో ఉన్న వారు చేయాల్సిన 12 పనులు ఇవే..! తప్పక తెలుసుకోండి.!

హోమ్ క్వారెంటైన్ లో ఉన్న వారు చేయాల్సిన 12 పనులు ఇవే..! తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

2020 సంవత్సరాన్ని అందరూ పాజిటివ్ ఆలోచనలతో ఆహ్వానించారు. కొంతమంది తమ ఉద్యోగం లేదా కెరియర్ కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు. ఫిబ్రవరి మధ్యలో నుండి కరోనా సూచనలు కనిపించడంతో లాక్ డౌన్ విధించారు. దాంతో చాలామంది అనుకున్న పనులు ఆగిపోయాయి. నిరాశ ఎక్కువయ్యి భవిష్యత్తు మీద భయం మొదలైంది.

Video Advertisement

అసలు తాము అనుకున్నది సాధించగలమా లేదా అని తమ మీద తమకే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల అందరూ అసలు కరోనా గురించి మర్చి పోయి మిగిలిన విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

భవిష్యత్తు కూడా ముఖ్యమైన విషయమే అనుకోండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్యం కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్తు గురించి బాధపడుతూ మీ సమయాన్ని వృధా చేయకుండా హోమ్ క్వారెంటైన్ పీరియడ్ ని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

#1 ముందు మెదడుని ఏదో ఒక ఆలోచనలతో బిజీగా ఉంచండి. నెగెటివ్ ఆలోచనలను దగ్గరికి రానివ్వకండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మీకు ఇష్టమైన రంగు ఏమిటి, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని కాదు. మీకు ఏ పని చేయడం అంటే ఇష్టం? ఎలాంటి పనిలో మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది? మీకు నిజంగా మీ జీవితంలో ఏం కావాలి? అనేది తెలుసుకోండి.

#2 ఇంటర్నెట్ లో వెతికితే దొరకనిదంటు ఏమీ లేదు. కాబట్టి మీకు ఇష్టమైన దానిమీద ఏదైనా ఆన్లైన్ క్లాస్ లో చేరండి. మీ నైపుణ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎప్పుడు ఏ అవకాశం తలుపు తడుతుందో ఎవరికి తెలుసు?

#3 పుస్తకాలు చదవండి. పుస్తకాన్ని మించిన స్నేహితులు మరొకరు ఉండరు. ఒకవేళ మీరు మానసికంగా బలహీనంగా ఉంటే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలను చదవండి. కచ్చితంగా మళ్లీ కొత్త ఉత్సాహంతో లేచి పని చేయగలుగుతారు. ఏవైనా మిస్ అయినా సినిమాలు ఉంటే చూడండి.

#4 పొద్దున్నే లేవండి. మానసిక ఒత్తిడి వల్ల మనకి తెలియకుండానే మనం బరువు పెరిగి పోతూ ఉంటాం. ఒకవేళ మీరు మీ బరువును నియంత్రించుకోవాలి అనుకుంటే వ్యాయామం చేయండి. ముఖ్యంగా యోగా. యోగా వల్ల బరువు తగ్గడంతోపాటు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు.

#5 మీరు రోజు మొత్తంలో తీసుకునే ఆహారంలో కచ్చితంగా విటమిన్ సి ఉండేలా చూసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లో విటమిన్ సి ఉన్న పండ్లు తినడానికి ప్రయత్నించండి. లంచ్ లో విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తినండి. రాత్రిపూట కూడా పండ్లు కానీ మామూలు ఆహారాన్ని కానీ తీసుకోండి. ఏది తిన్నా కూడా రాత్రిపూట కొంచెం తేలికగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఒకవేళ హెవీ ఆహారం తిన్నా కూడా తక్కువ మోతాదులో తినమని డాక్టర్లు చెబుతున్నారు.

#6 అలాగే టీ, కాఫీ కి బదులు హెర్బల్ టీ అలవాటు చేసుకోండి. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ టీ గానీ కాఫీ గానీ తాగాలని అనిపిస్తే రోజులో ఒకసారి తాగండి.

#7 అంతేకాకుండా పాలలో పసుపు వేసుకొని తాగండి. గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగండి. దీనివల్ల శరీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బయటికి వెళ్లిపోతాయి. అలాగే అప్పుడప్పుడు ఆవిరి కూడా పడుతూ ఉండండి. దాంతో శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి.

#8 వీలుంటే మధ్యాహ్నం గంట లేదా అరగంట నిద్రపోండి. మధ్యాహ్నం వరకు ఏదో ఒక పని చేసి ఉంటారు కాబట్టి విశ్రాంతి కచ్చితంగా అవసరం. కాబట్టి మధ్యలో ఒక గంట బ్రేక్ తీసుకోండి. ఒక టైం టేబుల్ వేసుకోండి. దాన్ని బట్టి మీ పనులు చేసుకోండి. మొదట టైం టేబుల్ ప్రకారం అన్ని పనులు చేయడం కష్టం గానే ఉంటుంది. కానీ మెల్లగా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది.

#9 వీలైనంత వరకు ఫోన్ కి దూరంగా ఉండండి. అంటే అది కష్టమైన పనే. కానీ ఒక సమయం తర్వాత ఫోన్ జోలికి వెళ్ళకూడదు అని మీకు మీరే ఒక రూల్ పెట్టుకోండి. ఆ సమయం రాత్రి మీరు పడుకో బోయే ఒక గంట ముందు అయితే ఇంకా మంచిది. అలాగే పొద్దున లేచిన తర్వాత కూడా కొంచెం సేపటి వరకు ఫోన్ కి దూరంగా ఉండండి.

#11 రోజు మొత్తం ఏమో లే గాని రాత్రి పడుకున్నప్పుడు మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తాయి. భవిష్యత్తు మీద ఇంకా భయం పెరుగుతూ ఉంటుంది. కొందరైతే నిద్రపోకుండా అవే ఆలోచిస్తూ బాధపడతారు. ఈరోజు జరిగింది వదిలేసేయ్యండి.

#12 మీరు ప్రతి రోజూ మీరు సాధించాలి అనుకున్న దానికోసం వేసే చిన్న అడుగు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి నిద్ర పోయే ముందు రేపు ఏం చేయాలి అనేది ఆలోచించుకొని పడుకోండి. ఆలోచించడమే కాకుండా ఆచరించండి. ఏదేమైనా మీరు సాధించాలనుకున్న దానికోసం ప్రయత్నించడం మాత్రం అస్సలు వదిలేయకండి.

మీరు ఇవన్నీ సాధించేది మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇంకా ఎవరి ఆరోగ్యం మీద శ్రద్ధ వారే తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు లాక్ డౌన్ అనేది తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెట్టింపు ఉత్సాహంతో,శక్తితో మీ లక్ష్యం కోసం పనిచేయటానికి ఇప్పటినుంచే సన్నద్ధం అవ్వండి.


End of Article

You may also like