ట్రైన్ లో వినూత్నంగా వ్యాపారం చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భేల్ పూరీ వ్యాపారి!

ట్రైన్ లో వినూత్నంగా వ్యాపారం చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భేల్ పూరీ వ్యాపారి!

by Mounika Singaluri

Ads

అందరూ చేసే వ్యాపారమే అతను చేస్తున్నాడు కానీ అతను చేసే పని చాలా వినూత్నంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇది ఒక భేల్ పూరీ వ్యాపారి కథ. అందరూ చేసే పనిని విభిన్నంగా చేస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాము అనటానికి ఈ వ్యాపారి మంచి ఉదాహరణ. కొంతమంది తమ విభిన్నమైన ఆలోచనలతో పలువురు దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని మరింత వైరల్ అవుతూ ఉంటారు.

Video Advertisement

ఇప్పుడు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి వినూత్నంగా భేల్ పూరీని విక్రయిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భేల్ పూరీ ని అమ్మటంలో వినూత్నం ఏముంది అని అనిపించవచ్చు అయితే ఈ వ్యాపారి అందరిలా కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో పదార్థాలన్నీ మిక్స్ చేస్తూ ఎక్కడా అపరిశుభ్రతకి తావియ్యకుండా శుభ్రమైన భేల్ పూరీ ని రైలు ప్రయాణికులకు ఇస్తూ వాళ్ళ మనసు దోచుకుంటున్నాడు.

train

భేల్ పూరీకి కావలసిన ఆహార పదార్థాలు అన్నింటిని డబ్బాలలో వేసుకొని వాటిని నడుముకి కట్టుకున్నాడు. చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఇంగ్రిడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటూ చక్కని టేస్ట్ తో ఎంతో నీటుగా ఏ ఒక్క పదార్థాన్ని చేత్తో తాకకుండా ఒక స్పూన్ సహాయంతో ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. రుచి కూడా అద్భుతంగా ఉండటంతో అతని దగ్గర భేల్ పూరీ కొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఒక ప్రయాణికుడు ఇతనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది అతని శుభ్రతకి కొందరు నెటిజన్ హాట్సాఫ్ చెప్తుంటే అతని వ్యాపార నిబద్ధతకి ఏ రోజైనా పెద్ద వ్యాపారవేత్త అవుతాడు అంటూ కొందరు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక పనిని వినూత్నంగా చేస్తే పలువురు దృష్టిలోని పడతాము అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది.

watch video : 

https://www.instagram.com/reel/C1quHXFBJMs/?utm_source=ig_embed&ig_rid=d97f342f-a497-44b1-b9b4-c41d11363e03


End of Article

You may also like