సినిమాల్లోకి రాకముందు సీనియర్ ఎన్టీఆర్ ఏమి పనులు చేసేవారో తెలుసా..? ఆయన ఎన్ని జాబ్స్ చేసారంటే?

సినిమాల్లోకి రాకముందు సీనియర్ ఎన్టీఆర్ ఏమి పనులు చేసేవారో తెలుసా..? ఆయన ఎన్ని జాబ్స్ చేసారంటే?

by Anudeep

Ads

సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Video Advertisement

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయనని నిత్యం ప్రేక్షకుల గుండెల్లోనే ఉంచుతాయి. ఆయన గురించి ప్రతి విషయాన్నీ ఇప్పటికీ ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

ఎన్టీ రామారావు గారు గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. అటు రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణించారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఏమి పని చేసేవారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఏమిచేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ తండ్రిగారు లక్ష్మయ్య చౌదరిగారు. ఆయన కట్టించిన ఇంట్లో సూర్యనారాయణ అనే వ్యక్తి కుటుంబం అద్దెకు ఉండేది. వీరితో ఎన్టీఆర్ కు మంచి అనుబంధమే ఉండేది. అయితే బిజినెస్ కోసం ముంబై వెళ్లిన సూర్యనారాయణను అక్కడి పార్టనర్స్ మోసం చేస్తారు. ఈ విషయమై ఎన్టీఆర్ సాయం తీసుకుంటారు. ఆయనకు సాయం చేయడానికి ముంబై వెళ్లిన ఎన్టీఆర్ కోర్ట్ లో సంబంధిత పత్రాలను సమర్పించి సూర్య నారాయణకు న్యాయం జరిగేలా చేస్తారు. అలా ముంబైలో ఉన్న టైం లోనే ఎన్టీఆర్ మెస్ ను స్థాపిస్తారు. అయితే.. తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఈ ప్రయత్నం విరమించుకుని ఇంటికి వచ్చేస్తారు.

sr ntr

ఆ తరువాత ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం నడుపగా.. అది కూడా అచ్చిరాలేదు. బిఎ చదువుతున్న టైం లో ఎయిర్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. కానీ, భార్యకి ఇష్టం లేకపోవడం వల్ల ఆ జాబ్ లో జాయిన్ అవ్వకుండా వదిలేస్తారు. తరువాత సబ్ రిజిస్ట్రార్ గా కేవలం 11 రోజుల పాటే పని చేస్తారు. ఆ తరువాత సినిమాలలో అవకాశం రావడంతో ఇండస్ట్రీ వైపు వచ్చేసారు. ఆరోజు నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.


End of Article

You may also like