సివిల్స్ చాలా కీలకమైన పరీక్ష. నిజంగా సివిల్స్ లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. అహర్నిశలు శ్రమిస్తే కానీ సివిల్స్ లో విజయం సాధించడం సులభం కాదు. సివిల్స్ లో ర్యాంక్ పొందడం ఒక ఎత్తయితే… ఇంటర్వ్యూ మరొక ఎత్తు అని చెప్పాలి.

Video Advertisement

అయితే ఇంటర్వ్యూ ని క్రాక్ చేయాలంటే పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు. తెలివితేటలు, సమయస్ఫూర్తి చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడే సాధించడానికి వీలవుతుంది. అటువంటి క్లిష్టమైన ఇంటర్వ్యూకి వచ్చిన ఒక మహిళ ఐఏఎస్ కు ఒక క్వశ్చన్ ఎదురయింది.

దానికి ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే షాక్ అవుతారు. అయితే అసలు ఏం జరిగింది అనేది చూస్తే… సోషల్ మీడియాలో ఈ సంఘటన విపరీతంగా వైరల్ అవుతోంది. కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల మహిళ పరీక్ష క్వాలిఫై అయ్యి తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ముందు కూర్చుంది. ఇక ఇంటర్వ్యూ మొదలయ్యింది. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం మొదలుపెట్టింది. దీనితో ఒక ఇంటర్వ్యూయర్ ఆమెని ఒక ప్రశ్న అడిగారు.

మీకు వివాహం అయ్యింది. మీ భర్త చనిపోయారు. దీంతో మీరు రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మీ భర్త మీ వద్దకు వచ్చారు, అప్పుడు మీరేం చేస్తారు..? అని అడగగా..ఏం చెప్పాలో అర్థం కాక ఆమె మొదట్లో తడబడింది. కానీ ఆమె ఆ తర్వాత ఆన్సర్ చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి షాక్ ఇచ్చింది. చనిపోయిన నా భర్త తిరిగి వచ్చినా చట్టప్రకారం నా రెండో వివాహం చెల్లుతుంది. ఎందుకంటే నా భర్త, నేను మాములుగా విడిపోతే విడాకుల పత్రం తీసుకుని వెళ్లి నేను రెండో వివాహం చేసుకోవచ్చు.

8 Top Tips for a Successful Job Interview in English | EF English Live

అదే ఒకవేళ మరణిస్తే డాక్టర్ ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళి నేను దానిని ప్రూఫ్ కింద చూపించి రెండో వివాహం చేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా సరే నా రెండో వివాహం చట్టపరంగా చెల్లుతుంది. ఒకవేళ మీరన్నట్లు నా భర్త తిరిగి వస్తే నా రెండో పెళ్లి విషయంలో ఎలాంటి సమస్య రాదు. అయినా ఎవరితో కాపురం చేయాలన్నది నా మనసు ఇష్టం అంటూ ఆ మహిళ సమాధానం చెప్పింది. ఇది విని ఇంటర్వ్యూ చేసే అధికారులు చప్పట్లు కొట్టారు.