తెలుగు చిత్రసీమలో ఎందరో నటీమణులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుకుకున్నారు. ఆ కోవలోకే వస్తారు సీనియర్ యాక్టర్ సుధ. దాదాపుగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. బాలనటిగా, కథానాయికగా, అత్తగా, అమ్మగా, అమ్మమ్మగా, వదినగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. ఎమోషనల్ సీన్లతోపాటు పాత్ర ఔచిత్యాన్ని బట్టి కామెడీని పలికించడంలోనూ సుధ దిట్ట. సీనియర్ నటుల నుంచి.. కొత్తగా వచ్చిన నటుల వరకు అందరితోనూ నటించారు సుధ.

Video Advertisement

 

అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఒడిదొడుకులను ఎదుర్కొన్నారని చాలా మందికి తెలీదు. ఈ విషయాల గురించి ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ” మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టా. అందుకే అమృతం అనే అర్థం వచ్చేలా నాకు సుధ అనే పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. తమ్ముడు పుట్టిన కొన్నాళ్లకు నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం ప్రారంభమైంది. తర్వాత అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్థాయి నుంచి ఏమీ లేని దీనస్థితికి చేరుకున్నాం’ అని ఆమె చెప్పారు.

senoir actress sudha about her personal life..!!

పెద్ద బంగ్లా, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా ఎంతో రాజసంగా బతికామని తెలిపారు సుధ. సినిమాల్లో చాలా డబ్బులే సంపాదించినా.. తర్వాత ఆమె చేసిన వ్యాపారాల వల్ల ఆర్థికంగా చితికి పోయామని వెల్లడించారు. భర్త కూడా ఆమెను వదిలేసి.. ఫారెన్ వెళ్లిపోయారట. మరోవైపు కుమారుడు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. అతనితో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. తనయుడు ఉన్నాడనే కానీ.. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడడని చెబుతూ ఎమోషనల్ అయ్యారు సుధ.

senoir actress sudha about her personal life..!!

జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని.. అందరూ ఉన్నా ఎవ్వరు లేని ఒంటరిని అయ్యానని.. జీవితం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్టు చెప్పారు సుధ. దేవుడు మనం ఏం చేయాలో ముందే నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చారు. భవిష్యత్ గురించి కలత చెందడం మానేశానని వివరించారు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడమే అన్నింటికన్నా ఉత్తమమని ఆమె చెబుతున్నారు.