‘నాపేరు మీనాక్షి’ సీరియల్ నటి గౌతమి చాలా మందికి సుపరిచితమే. ఆమె అసలు పేరు నటి మధురెడ్డి. ఆడదే ఆధారం సీరియల్ లో రేణుక గా, మిస్సమ్మ సీరియల్ లో స్వాతి గా కూడా ఆమె అలరిస్తున్నారు. అయితే.. ఆమెకు బాగా పేరు తెచ్చిన సీరియల్ “నా పేరు మీనాక్షి”. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. అప్పటి నుంచి గౌతమి గా నటి మధు రెడ్డినే నటిస్తున్నారు.

అయితే గత కొన్నిరోజులు గా ఈ సీరియల్ లో ఆమె పాత్ర కనిపించడం లేదు. దీనితో ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. అక్క మీరు సీరియల్ లో ఎందుకు కనిపించడం లేదు..? అంటూ పలువురు అభిమానులు ప్రశ్నిస్తుండడం తో.. ఆమె అసలు కారణం చెబుతూ ఏడ్చేసింది. “నా పేరు మీనాక్షి” సీరియల్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఎన్నో సీరియల్స్ చేసినా.. ఈ సీరియల్ తనకు బాగా పేరు తెచ్చిపెట్టిందని అందుకే ఈ సీరియల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

gowthami

ఆ ప్రాజెక్ట్ ని గుండెల్లో పెట్టుకున్నా.. ఏడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ ని వదలలేకపోయా.. అయితే ఈ సీరియల్ లోంచి నా రోల్ లేకుండా చేయడం జీర్ణించుకోలేపోతున్నా.. ఈ సీరియల్ లో కనిపించకపోవడానికి కారణమేంటంటే.. ఈ మధ్య కాలం లో నాకు డేట్స్ కుదరడం లేదు. కేవలం రెండు మూడు రోజులు మాత్రం షూట్ కి పిలుస్తున్నారు. ఇందుకోసం 15 రోజులు బ్లాక్ చేస్తున్నారు. ఈ విషయమై నేను యూనిట్ వారిని కూడా అడిగాను.

madhu reddy

అయితే.. నేను అడగడం లో తప్పు ఏమి ఉందొ తెలియదు గాని అసలు నా రోల్ నే లేకుండా చేసారు. పిలుస్తారు.. పిలుస్తారు లే అనుకున్నా.. ఆ సీరియల్ నుంచి నన్ను తప్పించడాన్ని జీర్ణించుకోలేపోతున్నా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. ఆ సీరియల్ లో నన్ను ఇష్టపడేవారు నువ్వు ఎందుకు కనిపించడం లేదు అంటూ నా ఛానెల్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ సీరియల్ నుంచి వారు తీసేసారా లేక నేనే మానేసానా..? అన్న విషయమై క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో ను పోస్ట్ చేస్తున్నా అని వివరించారు.