“శాకుంతలం” Vs “రుద్రుడు”..! ఈ 2 సినిమాల టాక్ ఒకటే..! కానీ కలెక్షన్స్ దేనికి ఎక్కువ వచ్చాయి అంటే..?

“శాకుంతలం” Vs “రుద్రుడు”..! ఈ 2 సినిమాల టాక్ ఒకటే..! కానీ కలెక్షన్స్ దేనికి ఎక్కువ వచ్చాయి అంటే..?

by kavitha

Ads

శుక్రవారం (ఏప్రిల్ 14 ) బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు ఆసక్తికరమైన చిత్రాలు విడుదల అయ్యాయి. హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం మరియు రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రుద్రుడు.

Video Advertisement

వీటిలో పాన్ ఇండియా వైడ్ గా బజ్ ను ఏర్పరుచుకున్న ‘శాకుంతల సినిమాని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ చిత్రంలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించడంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.

కదిరేసన్ దర్శక నిర్మాతగా రాఘవ లారెన్స్ హీరోగా నటించిన తమిళ చిత్రం’ రుద్రన్’. ఈ మూవీని తెలుగులో రుద్రుడుగా విడుదల చేశారు. ఈ సినిమా శకుంతల సినిమాతో పోటీగా విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలకు ఏ మాత్రం పోలిక లేదు. శాకుంతలము మూవీ మైధలాజికల్ సబ్జెక్ట్ తో రూపొందింది. ఇక రుద్రుడు చిత్రం మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మాస్ చిత్రం. ఒకే రోజు విడుదలైన ఈ చిత్రాలు ఎంత వసూలు చేసాయో ఇప్పుడు చూద్దాం..
shaakuntalam-vs-rudrudu-day-1-collections1శాకుంతలం:

శాకుంతలం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ కు ముందు వేసిన ప్రీమియర్లతో మొదటి షో నుంచే నెగిటివ్ టాక్‌ ను తెచ్చుకుంది. అయితే టాక్ నెగెటివ్ అయినప్పటి మొదటి రోజున శాకుంతలం సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టడంతో అటు ట్రేడ్ వర్గాలను, ఇటు సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే శాకుంతలం సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
samantha about shakunthalam movie..!!మొదటి రోజు కలెక్షన్స్:

నైజాం – 52 లక్షలు,

సీడెడ్ – 10 లక్షలు,

ఆంధ్ర – 46 లక్షలు,

ఏపీ+తెలంగాణ – కోటి ఎనిమిది లక్షల షేర్, రెండు కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మిగతా భాషలలొ 42 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు మొత్తం కలిపి 2 కోట్ల 24 లక్షల షేర్, 4 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది.
how much screen time did arha got in shakunthalam movie..రుద్రుడు:

గతంలో రాఘవ లారెన్స్ చిత్రాలు తెలుగులో భారీ కలెక్షన్స్ ను సాధించాయి. అందువల్ల ‘రుద్రుడు’ సినిమాకి భారీగా బిజినెస్ జరిగింది. టాలీవుడ్ లో బీ కేటగిరి హీరోలకు కన్నా ఎక్కువ బిజినెస్ ఈ చిత్రానికి రావడం ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. కానీ మొదటి షోతోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆడియెన్స్, సినీ విమర్శకులు కూడా ఈ మూవీ పై పెదవి విరిచారు. ఈ క్రమంలో రుద్రుడు సినిమా మొదటి రోజు వసూళ్ళు ఎలా ఉన్నాయంటే?
మొదటి రోజు కలెక్షన్స్:

నైజాం – 26 లక్షలు

సీడెడ్ – 15 లక్షలు,

ఉత్తరాంధ్ర – 10 లక్షలు,

ఈస్ట్ గోదావరి – 8 లక్షలు,

వెస్ట్ గోదావరి – 4 లక్షలు,

గుంటూరు – 7 లక్షలు,

కృష్ణ – 7 లక్షలు,

నెల్లూరు – 3 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 80 లక్షల షేర్, కోటి 5 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, లారెన్స్ రుద్రుడు సినిమాతో పోల్చితే సమంత నటించిన శాకుంతలం సినిమా వసూళ్ల పరంగా మెరుగ్గా ఉంది. రోజు భారీగా వసూళ్లను సాధించింది.

Also Read: “విరూపాక్ష” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like