గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్‌ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చనవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. అయితే మధ్యలో ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు.

Video Advertisement

దీంతో తాజాగా వచ్చిన “పఠాన్” మూవీ పైనే షారుఖ్ ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే పఠాన్ మూవీ రికార్డ్స్ కొల్లగొడుతూ దూసుకుపోతోంది. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు. ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 – 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని రిలీజ్ చేశారు.

shahrukh setting new records for all industries..

ఈ సినిమా బాలీవుడ్ లో ఫస్ట్ డే రికార్డుల నుండి వీకెండ్, వీక్ అండ్ లైఫ్ టైం ఇలా అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. ఎనిమిది రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 336 కోట్లు నెట్‌తో పాటు రూ. 667 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా 9వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 28 – 30 కోట్లు గ్రాస్, రూ. 14 – 16 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఓన్లీ హిందీ వెర్షన్స్ 680 కోట్లు వసూలు చేసింది.

shahrukh setting new records for all industries..

ఇక హిందీ వర్షన్ కింద పఠాన్ సినిమా బాలీవుడ్ లో న్యూ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటివరకు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 702 కోట్ల రేంజ్ గ్రాస్ తో మొదటి స్థానం లో ఉంది. ఇక రానున్న వీకెండ్ లో కూడా ఈ చిత్రం మరో లెవెల్ కి చేరుకోబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో బాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ కి ఆల్ టైం ఎపిక్ టార్గెట్ ను సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది.