స్టార్ హీరోయిన్‌ సమంత నటించిన పీరియాడికల్‌ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Video Advertisement

 

 

‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది.

shakunthlam OTT platform and release date fixed..!!

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ అయి పెద్ద షాక్ ఇచ్చిందని స్వయంగా చెప్పారు. దాదాపు ఈ సినిమా వల్ల 30 కోట్లకు పైగా నష్టం వచ్చినట్టు సమాచారం. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

shakunthlam OTT platform and release date fixed..!!

సామ్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండడంతో రూ.20 కోట్లు మరీ శాకుంతలం ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేశారు. ఫ్లాప్ టాక్ అని రావడంతో థియేటర్స్ కి వెళ్లకుండా ఉన్నవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ కానుందట.

shakunthlam OTT platform and release date fixed..!!

థియేటర్స్ లో మెప్పించలేకపోయిన శాకుంతలం సినిమా అమరి ఇప్పుడు ఓటీటీలో అయినా మెప్పిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సమంత సిటా డెల్ అనే వెబ్ సిరీస్లో నటించింది ఈ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి చిత్రంలో కూడా నటిస్తోంది.