తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణమైన నటన విభిన్నమై చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకు వెళ్తోన్న అతడు త్వరలో ఓ ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ వివాహం రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో జూన్ 3న జేష్ట్య మాసం పౌర్ణమి రోజున పండితులు నిర్ణయించిన ముహూర్తాన పెళ్లి జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Video Advertisement

 

 

ఈయన నిశ్చితార్ధం జనవరిలో ఘనంగా జరిగింది. అయితే మధ్యలో ఈ పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ.. శర్వానంద్.. రక్షితతో తన వివాహా తేదిని అధికారికంగా ప్రకటించాడు. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షితతో జనవరిలో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగింది. ఇప్పటికే శర్వానంద్‌-రక్షిత వివాహ కార్యక్రమాలు మొదలయ్యాయి.

sharwanand wedding cost..!!

జూన్‌ 2న మెహందీ, సంగీత్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తారని.. 3వ తేదీన శర్వా-రక్షితా పెళ్లి జరగనుంది. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ ప్యాలెస్‌లో పెళ్లి అంటే కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలానే శర్వా కూడా తన పెళ్లి కోసం భారీగా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

sharwanand wedding cost..!!

లీలా ప్యాలెస్‌ లో ఒక్క రోజుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ రెండు రోజలు పెళ్లికి గాను శర్వా మొత్తంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కోట్ల ఖర్చుతో.. అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ రాయల్‌ వెడ్డింగ్‌కి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం.

sharwanand wedding cost..!!

శర్వానంద్ పేరుకే టైర్ టూ హీరో. సంపదలో మాత్రం స్టార్ హీరోలు సరిపోరు. శర్వానంద్ కుటుంబానికి హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆర్థికంగా ఉన్నతమైన ఫ్యామిలీలో పుట్టాడు. ఇక అమ్మాయి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కూడా తక్కువ కాదు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షిత రెడ్డి. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 

Also read: “బాహుబలి” చిత్రాల కోసం అన్ని కోట్ల అప్పు చేశారా..? “రానా” కామెంట్స్ వైరల్..!