మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. కొత్తగా పెళ్లయింది.. అంతలోనే ఇలాంటి పని ఎందుకు చేసింది..?

మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. కొత్తగా పెళ్లయింది.. అంతలోనే ఇలాంటి పని ఎందుకు చేసింది..?

by Megha Varna

Ads

హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది అశ్విని. మూడు నెలల క్రితం ఆమెకు వివాహమైంది. ఈమె జీవితమంతా సాఫీగా సాగుతోంది. కానీ ఇంతలో కాలువలో శవమై తేలింది. ఇక అసలు ఏమైంది అనే దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు, తులసి కి ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్దమ్మాయి అశ్విని.

Video Advertisement

ఈమె హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. 3 నెలల క్రితం భీమవరానికి చెందిన రామకృష్ణ తో అశ్వినికి పెళ్లయింది. కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రొం హోమ్ చేస్తోంది అశ్విని. సంక్రాంతికి తన భర్త తో పాటు పుట్టింటికి వెళ్ళింది. సంక్రాంతి పండగ కూడా చేసుకున్నారు. తర్వాత భర్త రామకృష్ణ హైదరాబాద్ కి తిరిగి వెళ్ళి పోయాడు.

గురువారం అర్ధరాత్రి ముత్యాల పల్లి వైపు అశ్విని బండి మీద వెళుతూ ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన కుమార్తె ఇంకా ఇంటికి రాక పోవడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా వెతికారు కుటుంబ సభ్యులు. అయితే ఉప్పుటేరులో బండి ఉండటం చూసి వెతకగా మృతదేహం కనబడింది. గత సంవత్సరం కరోనా కారణంగా అశ్విని తండ్రి మరణించాడు. అయితే తన తండ్రి ఇక లేడు అన్న బాధ తో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

ఇదే ఆమె మరణానికి కారణం అని ఇంకా తెలియలేదు. ఇది ఇలా ఉంటే భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయ అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంతే కాకుండా సెల్ ఫోన్ డేటా ని కూడా పరిశీలిస్తున్నారు. ఇలా వివిధ కోణాలను పోలీసులు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈమె మరణంతో కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.


End of Article

You may also like