శోభనం గదిలోకి కొత్త పెళ్లికూతురును “పాల గ్లాస్”తో ఎందుకు పంపిస్తారో తెలుసా.? వెనకున్న 6 కారణాలు ఇవే..!

శోభనం గదిలోకి కొత్త పెళ్లికూతురును “పాల గ్లాస్”తో ఎందుకు పంపిస్తారో తెలుసా.? వెనకున్న 6 కారణాలు ఇవే..!

by Megha Varna

Ads

మనం చాలా సినిమాలలో చూసే ఉంటాము. పెళ్లి అయిన తరువాత వధూవరులను తొలిరోజు శోభనం గదిలోకి పంపేముందు.. వధువు చేతిలో పాలగ్లాసు పెట్టి లోపలకి పంపుతారు. పెళ్లి అయిన వారికీ కూడా ఈ సంగతి తెలిసే ఉంటుంది. తోలి రాత్రి గదిలోకి పంపేటప్పుడు అమ్మాయి చేతిలో పాలగ్లాసు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు..?

Video Advertisement

సాధారణం గా పెళ్లి అవ్వగానే.. వధూవరులిద్దరికి చనువు ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. వారి ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచడానికే.. వారి చేత బంతులాడిచ్చడం వంటివి చేస్తూ ఉంటారు. అలానే.. పాలగ్లాసు ఇచ్చి పంపిన తరువాత భార్యాభర్తలు ఇద్దరు ఆ పాలను చెరో సగం పంచుకుని తాగుతారు. అలా వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

#1. పాలు తాగడం వలన హ్యాపీ హార్మోన్స్ విడుదల అయ్యి ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. పాల వలన ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఇరువురిలోను శృంగార ప్రేరేపణ కల్పించి వారి మధ్య బంధాన్ని పెంచుతుంది.

#2. ఇలా గదిలోకి పంపేటప్పుడు ఉత్తి పాలు మాత్రమే కాకుండా అందులో బాదాం పప్పులు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు కలుపుతారు. దీనితో శరీరం లో ప్రొటీన్ల స్థాయి పెరుగుతుంది. హార్మోన్లు విడుదల అవుతాయి.

#3.శృంగార సమయం లో దంపతులకు వచ్చే వేడిని తగ్గించడానికి పాలు ఎంతగానో ఉపకరిస్తాయి.

#4. కామసూత్ర లో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. శక్తి సామర్ధ్యాలను పెంపొందించడానికి ఇలా శోభనం గదిలో వధూవరులిద్దరిచే పాలు తాగిస్తారట. ఈ సంప్రదాయం తరతరాలనుంచి ఆనవాయితీ గా వస్తోంది. తేనే, పంచదార, మిరియాలు, పసుపు కలిపిన పాలను వధూవరులిద్దరిచే తాగించడం మన పూర్వీకుల కాలం నాటినుంచే ఉంది.

#5. పెళ్లి అనగానే ..పిండివంటలు, నాన్ వెజ్ లు పొట్టలో గట్టిగానే పడిపోతాయ్, వాటి కారణంగా వధూవరుల్లో ఎసిటిడీ వచ్చేస్తుంది. ఈ ఎసిడిటీ ని పాలు తగ్గిస్తాయ్. దీని కారణంగా రతిక్రీడ సంతృప్తికరంగా సాగుతుంది.

#6. పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది. ఇది కూడా ఒక కారణం.

 


End of Article

You may also like