ఈ మధ్యనే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’. మే 07 న విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తుంది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ బాలీవుడ్ చిత్రం 4 రోజులకే రూ.40 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాల నడుమ ప్రెకషకుల ముందుకి వచ్చింది.
Video Advertisement
లవ్ జిహాద్ అంశంపై తెరకెక్కిన ఈ సినిమాపై ఆది నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. మొదట 32 వేల మంది మహిళల యదార్థ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరెక్కించామని చెప్పుకొచ్చిన డైరెక్టర్ సుదీప్తోసేన్.. ఆ తర్వాత కేవలం ముగ్గురు యువతుల జీవితం ఆధారంగానే సినిమా నిర్మించామన్నాడు. భద్రతాపరమైన కారణాలతో తమిళనాడు, బెంగాల్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రదర్శనలు నిలిపేశారు.
ఈ మూవీ లో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి చుట్టూనే ఈ చిత్రం మొత్తం తిరుగుతుంది. అయితే ఈ చిత్రం పై వస్తున్న వివాదాలపై తాజాగా నటి సిద్ధి ఇద్నానీ స్పందించారు. “కేరళ స్టోరీ వివాదాస్పద చిత్రం కాదు.. అవగాహన కల్పించే చిత్రం. ఇది ఏ మతాన్ని కించపరిచే చిత్రం కాదు. తీవ్రవాదాన్ని ఖండించే చిత్రం.” అని సిద్ధి ఇద్నానీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
‘ది కేరళ స్టోరీ’లో గీతాంజలి పాత్రలో నటించిన సిద్ధి ఇద్నానీ సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నటిగా సుపరిచితురాలు. సిద్ధి 2018లో ‘జంబ లకిడి పంబ’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ కి కొందరు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు మండిపడుతున్నారు.
మరోవైపు థియేటర్లలో వివాదాలు, షోస్ క్యాన్సిల్ చేస్తుండడంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ది కేరళ స్టోరీ డిజిటల్ రైట్స్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 సొంతం చేసుకున్నట్లు సమాచారం.