లైన్ మెన్ జాబ్ అంటే తెలుసు కదా.. కరెంట్ స్తంభాలు ఎక్కి వైర్లను బిగించాల్సి ఉంటుంది. ఎవరికీ ఇబ్బంది వచ్చినా..వెంటనే వెళ్లి వాళ్ళ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి పవర్ కట్ అయితే ఎవరైనా విసుక్కుంటారు. వెంటనే సాల్వ్ చేయకపోతే లైన్ మెన్ పై అరుస్తుంటారు. ఈ జాబ్ లో ఉండే కష్టాలు మామూలువి కాదు.

అలాంటి స్తంభాలెక్కడం, గోడలెక్కడం అబ్బాయిలు ఆడుతూ పాడుతూ చేసేస్తుంటారు. ఇప్పటివరకు ఆ జాబ్ లో అబ్బాయిలని, కుర్రాళ్ళని చూసి ఉంటారు. కానీ ఇపుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక లైన్ విమెన్ ది. ఈ కరెంట్ పోల్స్ ఎక్కడ అమ్మాయిల వల్ల ఎక్కడ అవుతుంది అని నవ్వుకోకండి.. ఈ అమ్మాయి స్టోరీ తెలిస్తే.. తప్పకుండా కళ్ళు చెమరుస్తాయి.

siddhipet sirisha

తెలంగాణ గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన శిరీష ఫస్ట్ లైన్ విమెన్ గా జాబ్ కొట్టింది. అసలు లైన్ విమెన్ జాబ్ ఉందని కూడా చాలా మందికి తెల్సి ఉండదు. ఈ జాబ్ కి అప్లై చేసే అమ్మాయిలు కూడా ఉండరు. కానీ శిరీష ధైర్యం గా అప్లై చేసి పరీక్షలోను, ప్రాక్టికల్ టెస్ట్ లో కూడా విజయం సాధించింది. ఇలాంటి జాబ్ లు అమ్మాయిలు చెయ్యగలరా అన్న వాళ్ళ నోర్లు మూయించింది. సిద్ధిపేట , గజ్వేల్ లో నివాసం ఉంటున్న 20 సంవత్సరాల శిరీష TSSPDCL లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్న తన మామయ్య గైడెన్స్ తో ఎలక్ట్రీషియన్ కోర్స్ ను నేర్చుకుంది. పెళ్లి కి ముందే ఆ ఫీల్డ్ లో జాబ్ వస్తుంది అన్న ఉద్దేశం తో ఆమె కు అలా గైడెన్స్ ఇచ్చారు.

sireesha got line women job

అలా తన మామయ్యా శేఖర్ ఇచ్చిన గైడెన్స్ తోనే తానూ ఐటిఐ పూర్తి చేసింది. TSSPDCL లో నోటిఫికేషన్ పడగానే, అప్లై చేసి ఎగ్జామ్ రాయించారు. అది పాస్ అవ్వడం తో ఆమెకు జాబ్ కంఫర్మ్ అయిపోయిందని అనుకున్నారు. కానీ, ఇంటర్వ్యూ టైం లో ఇది మగవాళ్ళు చేసే జాబ్ మీకు సూట్ అవ్వదు అని చెప్పడం తో నిరాశపడ్డారు. కానీ అక్కడితో ఆగలేదు.

శిరీష హై కోర్ట్ లో పిటిషన్ వేసింది. తానూ ఆ జాబ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మేము ఈ జాబ్ ఎందుకు చేయకూడదు అంటూ హై కోర్ట్ ను ప్రశ్నించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాను ప్రాక్టికల్ గా చేయగలదు అని ప్రూవ్ అయితే.. జాబ్ ఇవ్వాలని TSSPDCL కు హై కోర్ట్ నోటీసు ఇచ్చింది. ఆ ప్రాక్టికల్ పరీక్షలో శిరీష నెగ్గింది, జాబ్ కొట్టింది.

siddhipet sirisha 2

శిరీష తన మావయ్య గైడెన్స్ లో రెండు నెలల్లో పని నేర్చుకున్నారు. కరెంట్ పోల్ ఎక్కడం, దిగడం, ప్రొబ్లెమ్స్ ని సాల్వ్ చేయడం వంటివి నేర్చుకుంది. ఎంతో స్ట్రగుల్ పడి తాను అనుకున్నది సాధించింది. అందరికి ఆదర్శం గా నిలిచింది.