Ads
జనాలు బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
Video Advertisement
మనం ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు లోకోమోటివ్ కోచ్ వెనకాల కుడి వైపు, ఎడమ వైపు రెండు రాడ్స్ నుండి, వాటికి సర్కిల్ షేప్ లో రెండు ప్లేట్స్ లాగా ఉన్న భాగాలను చూసే ఉంటాం.
మనలో చాలా మంది వీటిని చూసి రెండు కోచ్ లు అటాచ్ చేసి ఉండడానికి ఏర్పాటు చేసిన మ్యాగ్నెట్స్ అని అనుకుంటాం. కానీ కాదు. వాటిని సైడ్ బఫర్ అంటారు. సైడ్ బఫర్ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే. అసలు ముందు ఐసిఎఫ్ కోచ్ లను కనెక్ట్ చేయడానికి స్క్రూ కప్లింగ్ వాడేవాళ్ళు. కానీ స్క్రూలు టైట్ గా ఉంటాయి. కాబట్టి యాక్సిలరేట్ లేదా డీ – యాక్సిలరేట్ చేసినప్పుడు జెర్క్స్ ఎక్కువగా వచ్చేవి.
సైడ్ బఫర్, స్ప్రింగ్ మెకానిజం ద్వారా ఆపరేట్ అవుతుంది. వీటిని పుష్ చేసినప్పుడు లోపలి వైపుకి, బయటి వైపుకి తిరుగుతాయి. అందుకే ఒకవేళ ట్రైన్ స్పీడ్ పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు లేదా ట్రైన్ టర్న్ అయినప్పుడు, స్ప్రింగ్ మెకానిజం ఉంది కాబట్టి సైడ్ బఫర్ ఉపయోగించడం వల్ల ట్రైన్ సేఫ్ గా నడుస్తుంది.
సైడ్ బఫర్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో, ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ట్రైన్ ని యాక్సిలరేట్ లేదా డీ – యాక్సిలరేట్ చేసినప్పుడు, వాటిపై పడే ఇంపల్స్సెస్ ని తగ్గించడానికి సైడ్ బఫర్ ఉపయోగపడుతుంది. లేకపోతే జెర్క్స్ ఎక్కువగా వస్తాయి. అందుకే సైడ్ బఫర్ ఎనర్జీ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.
ఒక కోచ్ ఇంకొక కోచ్ కి తగలకుండా ఉండేలా సైడ్ బఫర్ చూసుకుంటుంది. టర్నింగ్ వచ్చినప్పుడు, అంటే ట్రైన్ టర్న్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బఫర్ లోపలి వైపుకి వెళ్తుంది, ఇంకొక బఫర్ బయటి వైపుకి ఉంటుంది. దాని వల్ల మలుపు తిరిగేటప్పుడు ట్రైన్ కి స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు ట్రైన్ సులభంగా తిరగగలుగుతుంది.
రెడ్ కలర్ కోచ్ లలో ఇలాంటి సైడ్ బఫర్ కనిపించదు. ఎందుకంటే వీటిలో సెంటర్ బఫర్ కప్లర్ వాడతారు. ఇది బఫర్ లాగా, కప్లర్ (కప్లింగ్) లాగా రెండు విధాలుగా పనిచేస్తుంది.
End of Article