Ads
మనలో చాలా మందికి చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. కొంత మంది టైంపాస్ కి తింటే, ఇంకొంత మంది మాత్రం ఫేస్ ఎక్ససైజ్ కోసం తింటారు. కొంత మంది కొంచెం సేపు మాత్రమే చూయింగ్ గమ్ నములుతారు. కానీ కొంత మంది మాత్రం గంటలు గంటలు చూయింగ్ గమ్ నములుతూనే ఉంటారు.
Video Advertisement
కానీ నిజంగానే చూయింగ్ గమ్ నమలడం అనేది ఫేస్ కి చాలా మంచి ఎక్సర్సైజ్ అని చాలా సర్వే లలో వెల్లడయింది. అయితే, చూయింగ్ గమ్ నమలడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
# చూయింగ్ గమ్ వల్ల పళ్ళు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. క్యావిటీస్ వస్తాయి. చూయింగ్ గమ్ లో ఉండే షుగర్ వల్ల పళ్ళ మీద ఉండే ఎనామిల్ పై ప్రభావం పడుతుంది. అందుకే షుగర్ లెస్, లేదా నో షుగర్ చూయింగ్ గమ్స్ వాడితే ఈ సమస్యలు కొంచెం తగ్గుతాయి.
# మనం సాధారణంగా ఒకవైపు మాత్రమే ఎక్కువగా నములుతాం. అలా చూయింగ్ గమ్ నమలడం వల్ల దవడ మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంతే కాకుండా చెవినొప్పి, తలనొప్పి కూడా వస్తాయి.
# చూయింగ్ గమ్ లో టైటానియం డయాక్సైడ్ అనే కెమికల్ ఉంటుందట. ఈ కెమికల్ వల్ల పేగులకు సమస్య వచ్చే అవకాశం ఉందట. ఈ కెమికల్ వల్ల మనం తినే ఆహారాన్ని పేగులు సరిగా గ్రహించలేవు. దాంతో పోషకాహారాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.
# అలాగే చూయింగ్ గమ్ ఎక్కువగా నమలడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చూయింగ్ గమ్ లో ఉండే మాన్నిటాల్, సార్బిటాల్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల డయేరియా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.
అందుకే చూయింగ్ గమ్ నమిలే అలవాటుని వీలైనంతవరకూ తగ్గిస్తే మంచిది అని, దాని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని. చూయింగ్ గమ్ కి బదులు ఫేస్ ఎక్ససైజ్ చేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
End of Article