SIGNIFICANCE OF JEELAKARA BELLAM: పెళ్లిలో “జీలకర్ర బెల్లం” కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా.?

SIGNIFICANCE OF JEELAKARA BELLAM: పెళ్లిలో “జీలకర్ర బెల్లం” కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా.?

by Mounika Singaluri

Ads

జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యం. కాబోయే భార్య ఇలా ఉండాలి కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ వధూవరులు కలలు కంటూ ఉంటారు. అలానే పెళ్లి తర్వాత అందమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు.

Video Advertisement

పైగా పెళ్లి అంటే మామూలు విషయమా..? పెళ్లంటే ఎన్నో అరేంజ్మెంట్స్… ఎన్నో కమిట్మెంట్స్. వివాహ ప్రక్రియ గురించి మనం ఇప్పుడు చూద్దాం.పెళ్లి చూపులు తో వివాహ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ తరవాత నిశ్చితార్థం ఉంటుంది. స్నాతకం, కాశీయాత్ర, గౌరీపూజ, మంగళస్నానాలు, కన్యావరణం, సుముహూర్తం, కన్యాదానం ఇలా ముప్ఫై ఐదు ఘట్టాలు ఉంటాయి. సుముహూర్తం సమయంలో వధూవరులు జీలకర్ర, బెల్లాన్ని ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం జరుగుతుంది. అయితే అసలు ఎందుకు వధూవరులు జీలకర్ర, బెల్లాన్ని ఒకరి శిరస్సు మీద మరొకరు పెట్టాలి…? దీని వెనుక కారణం ఏమిటి..? అదే ఇప్పుడు చూద్దాం.

వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు జీలకర్ర, బెల్లాన్ని ఉంచడంతో సగం పెళ్లి పూర్తవుతుంది. అలానే ఆ సమయంలో వధూవరులు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకోవాలి. వధూవరులు మొదటిసారి తాకినప్పుడు వాళ్ళ చూపులు స్పర్శ రెండు శుభప్రదంగా ఉండాలని ఈ నియమం పెట్టినట్లు పండితులు అంటున్నారు. మన పూర్వీకులు పెట్టిన ఆచారాలలో ఎంతో అర్థం ఉంటుంది. అందుకనే మన ఆచారాన్ని ఎప్పుడు కొట్టి పారేయకూడదు. జీలకర్ర, బెల్లం పెట్టే చోటున సహస్రార చక్రం వుంటుందట.

మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేల్కొల్పే ప్రయత్నం పెళ్లి లో జీలకర్ర బెల్లం ద్వారా చేస్తారట. వీటి వలన విద్యుత్ వలయం ఏర్పడుతుందని కూడా అంటారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. ఒంట్లో ఉన్న వేడి ఈ రెండింటి వలన పోతుంది. చలవచేస్తుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది.


End of Article

You may also like