పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మెహందీ ఫంక్షన్లను బాగా ఎక్కువ మంది చేస్తున్నారు. ఇది వరకు అందరు చేసేవాళ్ళు కాదు. అయితే అసలు ఈ మెహందీ ఫంక్షన్ కి ప్రాముఖ్యత ఏమిటి..?  మెహందీ లో ఉండే అద్భుతమైన గుణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. నరాలని చల్లగా మార్చేసే శక్తి వీటికి ఉంది టెన్షన్ ని కూడా దూరం చేస్తుంది.

Video Advertisement

మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరుపుతారు రెండు చేతులకి రెండు కాళ్ళకి వధువుకి గోరింటాకు పెడతారు. పైగా వధువు తాలూకా వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా రెండు చేతులకి గోరింటాకు పెట్టుకొని ఫోటోలకి ఫోజులిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరుపుతున్నారు. మంచి డెకరేషన్ మంచి సెట్ అప్ తో దీనిని జరుపుకున్నారు. డ్రెస్ కోడ్ వంటివి కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చేస్తున్నారు.

పాటలు పెట్టుకుని డాన్స్ లు కూడా వేస్తున్నారు అయితే ఇది ఎవరి పద్ధతి వాళ్ళది. ఎవరికి నచ్చినట్లుగా ఎవరు ఏం చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా మెహందీ వేడుకని చేస్తారు, గోరింటాకు ఎంత బాగా పండితే భర్తకి వారి మీద అంత ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటుంటారు పెద్దలు. మెహందీ ని బాగా పెట్టే వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్లే పెట్టుకుంటారు లేదంటే మెహందీ ఆర్టిస్ట్ ని పిలిపించి పెడతారు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వధువులు ఇండో అరబిక్ మరియు అరబిక్ మెహందీ డిజైన్లని కాళ్ళకి చేతులకి పెట్టించుకుంటున్నారు.