Ads
వసంత పంచమి ప్రతి సంవత్సరం హిందూచాంద్రమాన క్యాలెండర్ మాఘమాసంలో ప్రకాశంవంతమైన అర్ధ భాగంలో ఐదో రోజున జరుపుకుంటారు ఇది సాధారణంగా జనవరిలో లేదా ఫిబ్రవరిలో వస్తుంది. ఈరోజు నుంచే వసంతకాలం ప్రారంభం అవుతుంది.2024వ సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 14 న వస్తుంది. ఆరోజు ఉదయం 7 గంటల ఒక నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు అనుకూలమైన సమయము. సరస్వతి దేవి శుక్లపక్షం ఐదో రోజున బ్రహ్మనోటి నుంచి ఉద్భవించిందని చెబుతారు అందువల్ల వసంత పంచమి రోజున సరస్వతి దేవిని భక్తుల పూజిస్తారు. వసంత పంచమి అనేది భాష జ్ఞానం సంగీతం మరియు అన్ని కళల దేవత అయిన సరస్వతి దేవికి అంకితం చేయబడిన పండుగ.
Video Advertisement
ఈ సందర్భంగా అనేక విద్యాసంస్థలలో అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక ప్రార్థనలు పూజలు ఏర్పాటు చేస్తారు. పార్వతి దేవి మరియు శివుడిని ఏకం చేయటంలో మన్మధుడు కీలక పాత్ర పోషిస్తాడు. శివుడు తీవ్ర మనోవెలలో ఉన్నందున అతనిని వైరాగ్య స్థితి నుంచి తీసుకురావడానికి, అతనిని గృహస్తిగా చేయటానికి ఎంత సహాయం చేస్తాడు. అప్పటినుంచి వసంత పంచమి కొత్త పని ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.
సరస్వతీ పూజ సమయంలో యజ్ఞలు యాగాలు హోమాలు చేస్తారు. ఆరోజు అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్ల రంగులో ఉన్న క్షీరాణం నేతితో పిండివంటలు జరుగును వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి.
ఓం సరస్వతీ మాయా దృష్ట్వా, వీణా పుస్తక ధరణిమ్ | హన్స్ వాహిని సమాయుక్తా మా విద్యా దాన్ కరోతు మే ఓం || అనే మంత్రాన్ని జపించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఈరోజున పిల్లల చేత విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తారు సరస్వతీ దేవి ఆలయాలను సందర్శించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారని మంచి భవిష్యత్తుని అందిపుచ్చుకుంటాని పండితులు చెప్తున్నారు.
End of Article