ఈ 5 లక్షణాలు ఉంటే… నాణ్యమైన నిద్రను పొందుతున్నట్టే..!

ఈ 5 లక్షణాలు ఉంటే… నాణ్యమైన నిద్రను పొందుతున్నట్టే..!

by Mounika Singaluri

Ads

మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అలానే ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. వీటితో పాటుగా మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. నిజానికి చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు. నిద్ర బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి నిద్రను పొందితే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Video Advertisement

కానీ చాలామంది మంచిగా నిద్రపోలేరు దీనివలన ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. అయితే చాలామందికి సరిగా నిద్ర పోతున్నారా లేదా అనేది తెలియదు కానీ నిజానికి మీరు మంచి నిద్రని పొందుతున్నారా లేదా మంచిగా నిద్ర పోతున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మంచిగా నిద్రపోతున్నట్లు అర్థం. మరి ఇలా మీరు మంచిగా నిద్ర పోతున్నారా లేదా అనేది తెలుసుకోండి.

#1. డీప్ గా నిద్రపోవడం:

మీరు డీప్ గా నిద్రపోతున్నట్లయితే మంచిగా నిద్ర పోతున్నట్లు అర్థం. ఇలా మంచిగా నిద్ర పోయినప్పుడు మజిల్స్ రిలాక్స్ అవుతాయి. హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

#2. మంచం ఎక్కిన ఐదు నిమిషాలకి నిద్రపోవడం:

మీరు నిద్ర పోవాలని కళ్ళు మూసుకున్న 5 నుండి 15 నిమిషాలకు నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ కనుక నిద్రపోవడానికి ప్రయత్నించినప్పటికీ గంట సేపటి వరకు నిద్ర పట్టట్లేదు అంటే నిద్ర లేమి సమస్య ఉన్నట్టు.

#3. నిద్ర లేవడానికి అలారం అక్కర్లేదు:

రెగ్యులర్ గా మీరు ఒకే సమయానికి నిద్రపోతూ ఒకే సమయానికి నిద్ర లేస్తున్నట్లయితే మంచిగా నిద్ర పోతున్నట్లు. పైగా అలారం పని కూడా అవసరం లేదు.

#4. మీ కలలను మీరు మర్చిపోతారు:

నిద్ర పోయినప్పుడు మీకు వచ్చే కలలు మీరు మర్చి పోతున్నట్లు అయితే మీరు మంచిగా నిద్రపోతున్నట్లు అర్థం.

#5. ఉదయాన్నే ఉత్సాహంగా నిద్రలేస్తారు:

మీరు నిద్ర పోయిన తర్వాత ఉదయాన్నే ఉత్సాహంగా చక్కగా నిద్ర లేస్తున్నట్లయితే మంచిగా నిద్ర పోతున్నట్లు అర్థం. ఒకవేళ కనుక ఉదయం లేస్తూ లేస్తూ బద్దకంగా ఉంది అంటే మీరు సరిగ్గా నిద్ర పొవట్లేదు.


End of Article

You may also like