సింగర్ సునీత అంటే.. కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె పాటకు ఎంతమంది ఫాన్స్ ఉన్నారో లెక్కలేదు. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా.. ఒంటరిగా తన సమస్యలను తాను సాల్వ్ చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇటీవలే.. రామ్ తో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

sunitha 3

ఆమె పట్ల విమర్శలు చేసే వారి సంగతి ఎలా ఉన్నా.. ఆమెను అభిమానించే వారికి మాత్రం కొదవ లేదు. చాలా మంది ఆమె ను చూసి ఇన్స్పైర్ అయ్యే వారు కూడా ఉన్నారు. ఆమె ఓ సారి అలీతో సరదాగా షో కు వచ్చి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతోంది. “జర్నీ లో జాలీ గా” అంటూ ఓల్డ్ ఎపిసోడ్స్ ను మరోసారి ప్రేక్షుకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

sunitha 2

ఈ సందర్భంగా ఆ ముచ్చట్లన్నీ మరో సారి వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో సునీత ఫస్ట్ క్రష్ ఎవరు అని అడగగా సునీత “జాకీ ష్రాఫ్” పేరు చెప్పారు. జాకీ ష్రాఫ్ గత నాలుగు దశాబ్దాలుగా హిందీ మూవీ ఇండస్ట్రీ లో హీరో గా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అతని పేరు చెప్పగానే.. అలీ గారు అతని గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. రియల్ లైఫ్ లో ఆయనొక స్ట్రీట్ రౌడీ అని.. ఓ గూండా అని చెప్పారు..

sunitha 1

ఐతే.. అవేమి పట్టించుకోని సునీత ఎలా తెలిస్తే ఏంటి..? నా మనసులోకి వచ్చేసాడు కదా అంటూ నవ్వేసింది. ఎందుకు ఇష్టమో తనకు తెలియదని.. ఇష్టం మాత్రం ఉండేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత మళ్ళీ తనకే అనిపించేది అని.. ఎందుకు ఇష్టపడుతున్నానా? అని ఆలోచించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలను మీరు ఈ కింద వీడియో లో చూడొచ్చు.

Video: Click this Link to Watch Video