ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

Video Advertisement

సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది. ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే. ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం. పాటల మాంత్రికుడు సిరివెన్నెల ఒక సినిమాలో కూడా నటించారని తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో.. జగపతి బాబు హీరోగా నటించిన గాయం సినిమాలో సిరివెన్నెల నటించారు. కేవలం వర్మ మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ సినిమాలో నటించారు. గతంలో కూడా ఆయనను చాలా మంది దర్శకులు తమ సినిమాలో నటించాలని కోరినప్పటికీ ఆయన తిరస్కరించారట.