అద్దె ఇంట్లో ఇంగువని అమ్ముతూ వ్యాపారం మొదలెట్టి.. ఇప్పుడు నెలకు 25 సంపాదిస్తున్న ముగ్గురు అమ్మాయిల రియల్ స్టోరీ..!

అద్దె ఇంట్లో ఇంగువని అమ్ముతూ వ్యాపారం మొదలెట్టి.. ఇప్పుడు నెలకు 25 సంపాదిస్తున్న ముగ్గురు అమ్మాయిల రియల్ స్టోరీ..!

by Anudeep

Ads

తెలివితేటలు ఎప్పుడు ఒకరి సొత్తు కాదు. మనుగడ కోసం కొత్తగా ఎలాంటి ప్రణాళికలు రచించుకున్నా వాటికి తగ్గట్లు అమలు పరచడంలో కూడా శ్రద్ధ కనబరిస్తే తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తాము. దానికి ఈ ముగ్గురు అమ్మాయిలే ఉదాహరణ. మూడేళ్ళ క్రితం ఓ అద్దె ఇంట్లో మొదలైన వీరి వ్యాపారం ఇప్పుడు నెలకి 25 లక్షల సంపాదనతో దూసుకెతోంది. కేరళకు చెందిన ఈ ముగ్గురు అక్క చెల్లెల్లు డిగ్రీ చదువు పూర్తవ్వగానే ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం చేయాలనుకున్నారు.

Video Advertisement

ఆహార పదార్ధాల తయారీకి అయ్యే దినుసులతో వ్యాపారం చేయాలనుకున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేసారు. చివరకు ఇంగువ వ్యాపారం లాభసాటిగా ఉంటుందని భావించారు. 3వీస్‌ పేరుతో ఒక సంస్థని ప్రారంభించారు. ఫెరులా మొక్కల నుంచి వచ్చే గమ్ లాంటి పదార్థమే అసాఫోటిడా. దీనిని వ్యాపారంగా మార్చుకున్నారు. ఇంగువని అటు వంటల్లోను, ఇటు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు.

kerala sisters 3

దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇంగువని ఉపయోగిస్తారు. సాంబార్, పప్పు, కొన్ని పచ్చడిలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే.. ఇలా ఇంగువ తయారీ ఉత్పత్తి యూనిట్ ని తమ ఇంట్లో చేసిన పదార్ధాలనుంచే ఎంచుకున్నాం అని చెప్తారు ఈ అక్క చెల్లెల్లు. ఇంగువ వ్యాపారంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత వంటకు అవసరమైన ముప్పై రకాల దినుసుల్ని వారి వ్యాపారంలోకి తీసుకొచ్చారు.

kerala sisters 2

వీరి తయారీ యూనిట్ ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉంది. మొదటగా వీరు తయారు చేసిన ఇంగువని ట్రయిల్ రన్ చేసారు. అయితే చాలామంది బాలేదని చెప్పడంతో.. కొన్ని మార్పు చేర్పులు చేసారు. ఆ తరువాత బాలేదన్న వారే వీరి ప్రోడక్ట్ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. ఇక వీరి తల్లితండ్రులు సరళ, ప్రశాంత్‌ లు కూడా వీరికి ఎంతగానో సపోర్ట్ ఇస్తుంటారు. వీరిలో పెద్ద అమ్మాయి వర్ష తొలుత ఈ వ్యాపారాన్ని రెండు లక్షల పెట్టుబడితో ప్రారంభించింది. తరువాత చెల్లెళ్ళు కూడా భాగస్వామ్యులయ్యారు.

kerala sisters 1

వ్యాపారం ప్రారంభించడానికి ముందే ఉత్పత్తి ప్రక్రియను అర్ధం చేసుకోవడం కోసం వర్ష అగ్రోపార్క్‌ నుంచి శిక్షణ తీసుకుంది. తమిళనాడులోని ఇతర తయారీ యూనిట్లను కూడా పరిశీలించింది. తరువాత పూర్తి అవగాహనతో వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెట్స్ లో కూడా ఆర్డర్స్ వస్తున్నాయని సంతోషంగా చెబుతోంది. మొదట ఒక అద్దె ఇంట్లో చిన్న గదిలో ప్రారంభమైన ఈ వ్యాపారం ప్రస్తుతం రూ.50 లక్షల విలువ కల యంత్ర సామాగ్రితో నడుస్తోంది.

kerala sisters

మొదట్లో ఇంగువతో ప్రారంభించి.. ప్రస్తుతం కొత్తిమీర పొడి, పసుపు, కారం, మిరియాలు, చికెన్, మసాలా వంటి ప్రొడక్ట్స్ ను కూడా అందిస్తున్నారు. కేరళలో వీరి వ్యాపారం కోసం రెండు వేలకు పైగా అవుట్ లెట్స్ కు అనుమతి తీసుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వీరి వ్యాపారాన్ని ముందుకు సాగించడానికి పంపిణి దారుల కోసం ప్రయత్నిస్తున్నారు. మరో నాలుగేళ్లలో.. వీరి బ్రాండ్ ని అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ గా మార్చాలనేదే వీరి లక్ష్యమని పేర్కొన్నారు. మరి వీరి లక్ష్యం నెరవేరాలని కోరుకుందామా..?


End of Article

You may also like