“శివమణి” సినిమాలో లాంటి ఘటనే.. 56 సంవత్సరాల క్రితం సీసాలో లవ్ లెటర్.. మ్యాటర్ ఏంటో చూస్తే షాక్..!

“శివమణి” సినిమాలో లాంటి ఘటనే.. 56 సంవత్సరాల క్రితం సీసాలో లవ్ లెటర్.. మ్యాటర్ ఏంటో చూస్తే షాక్..!

by Anudeep

Ads

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్ లు మానవ కమ్యూనికేషన్లను మరింత దగ్గర చేసాయి. ఇలాంటి యుగంలో ప్రేమికులను కలుసుకోవడం, మాట్లాడుకోవడం అనేది చాలా చిన్న విషయం అయిపొయింది. ఒకప్పుడు ప్రేమికులు కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా కష్టాలు పడేవారు.

Video Advertisement

ఎన్నో ఎదురు చూపుల తరువాత కానీ కలుసుకోవడానికి గాని, మాట్లాడడానికి గాని వీలు అయ్యేది కాదు. అయితే ఆ ఎదురు చూపులోనే ఎంతో ప్రేమ దాగుండేది. తమ ప్రేమికుల కోసం ఎంతో అందంగా ప్రేమ లేఖలు రాసుకునేవారు.

love letter

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి, ఒక 50 సంవత్సరాల వెనక నాటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఇప్పుడంటే కుప్పలు తెప్పలుగా వచ్చిన డేటింగ్ యాప్స్ లో బాయ్ ఫ్రెండ్స్ లేదా గర్ల్ ఫ్రెండ్స్ ను వెతుక్కుంటున్నారు. కానీ, ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు.
ఒక్క ఇండియాలోనే కాదు.. కొన్ని ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అందుకు ఉదాహరణే రీసెంట్ గా ఓ సీసాలో దొరికిన లవ్ లెటర్. ఈ లవ్ లెటర్ ఇంగ్లాండ్ లో దొరికింది. ఇంగ్లాండ్ కు చెందిన ఇద్దరు యువతులు తమ బాయ్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

love letter 1

దాదాపు 56 సంవత్సరాల క్రితం ఇద్దరు యువతులు ఓ లేఖని రాసారు. దానిని సీసాలో భద్రపరిచారు. ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే.. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ సీసా పాడైపోలేదు. ఆ లెటర్ చినిగిపోలేదు. ఆగష్టు 9 , 1966 న ఆ ఇద్దరు యువతులు ఈ లేఖని రాసారు. వారి పేర్లు జెన్నిఫర్ కోల్ మన్, జానెట్ బ్లాంక్లి, ఈ నోట్ లో వారు వారి రూపాన్ని గురించి వివరించారు. తమకి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అన్న విషయాన్నీ కూడా తెలిపారు. తమ బాయ్ ఫ్రెండ్ కి 16 సంవత్సరాల కంటే తక్కువ 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదని రాసారు.

love letter 3

ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాక.. వారిని వెతికిపట్టుకునే పనిని కూడా ప్రారంభించారు. ఈ లేఖ రాసినప్పుడు వారి వయసు 15 సంవత్సరాలట. ప్రస్తుతం జెన్నిఫర్ వయసు 71 సంవత్సరాలట. ఆమె ఆచూకీ దొరికిందని సోషల్ మీడియాలో కధనాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఆమె ఆస్ట్రేలియాకి మారిపోవడంతో జానెట్ తో సంబంధాలు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక జానెట్ బ్లాంక్లి కూడా టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కొడుకు లేక సోదరుడిని సంప్రదిస్తే ఈ పరిచయం సులువయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారట. వీరిని సంపాదించగలిగితే.. వారి లేఖని తిరిగి వారికే అప్పగించాలని భావిస్తున్నారట.


End of Article

You may also like