నిద్ర పోయే ముందు ఫోన్ చూస్తున్నారా..? దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

నిద్ర పోయే ముందు ఫోన్ చూస్తున్నారా..? దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

by kavitha

Ads

చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా సమయం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు స్మార్ట్ ఫోన్లను వాడుతూనే ఉన్నారు. వెబ్ షోలు, ఓటీటీలో సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటి కోసం మొబైల్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. పడుకునే ముందు మొబైల్ చూడడం ప్రమాదకరం అని ఒక పరిశోధనలో తేలింది.

Video Advertisement

ఆ పరిశోధనలో నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే సమస్యల గురించి వెల్లడించారు. నిద్రపోయే ముందు ఫోన్ వాడటం వల్ల వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. చేతి నొప్పి:
నిద్రపోయే ముందు మొబైల్ ను ఉపయోగించినపుడు మన చేతుల ఎక్కువ సేపు ఒకే పొజిషన్ లో ఉంటాయి. ఇలా ఇబ్బందికరంగా ఎక్కువ కాలం చేయడం వల్ల చేతుల పై ప్రెజర్ పడుతుంది.
2. మెడ నొప్పి:
ఒకే పొజిషన్ లో మొబైల్ ను ఎక్కువసేపు చూడటం వల్ల మెడ పట్టేస్తుంది. మొబైల్ తెరను చూడడం కోసం మెడను చాలా సమయం ముందుకు తిప్పడం వల్ల సర్వైకల్ స్ట్రెయిన్ వస్తుంది. ఈ నొప్పి రాకుండా ఉండాలి అంటే వెన్నెముకను నిటారుగా పెట్టి దిండును వాడాలి.
3. కళ్ళ పై ఒత్తిడి:
నిద్రపోయే ముందు లైట్స్ ఆపేసి చీకట్లో ఎక్కువ సమయం మొబైల్ ను చూడటం వల్ల కాంతి పై ఒత్తిడి పడుతుంది.
4. కళ్ళు ఎర్రగా మారటం:
రాత్రి పడుకునే ముందు లైట్స్ ఆఫ్ చేసి మొబైల్ చూడడం వల్ల కళలు పొడిబారడం, దురద, చికాకు, కళలు ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. ఇవి కాంతి చూపు పై ప్రభావం చూపిస్తాయి.
5. ఒత్తిడి:
రాత్రి పూట స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది డిప్రెషన్ కి దారి తీస్తుంది. డిప్రెషన్ వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
6. నిద్రలేమి:

రాత్రి సమయంలో చాలా సేపు మొబైల్ చూడటం వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. ఇది కంటి పై ప్రెజర్ తీసుకురావడం వల్ల మెదడును మేల్కోనేలా చేస్తుంది. అందువల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.
ఈ సమస్యల నుండి బయట పడాలంటే రాత్రి సమయంలో మొబైల్ చూడటం మానేయలి. నిద్రను మెరుగు పరిచే మెడిటేషన్ లాంటివి చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

Also Read: వర్కౌట్లు చేస్తున్నపుడు ఈ లక్షణాలు కనిపించినట్లయితే గుండె సమస్యలు ఉన్నట్లే..!


End of Article

You may also like