Ads
చాలా మందికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. మీకు కూడా అలవాటు ఉందా అయితే తప్పకుండా మీరు ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలి.
Video Advertisement
నిజానికి గురక వలన ఇతరులకు చికాకు మాత్రమే కాకుండా మనలో పలు అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. పైగా గురక అనేది తీవ్రమైన వ్యాధులకు సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
గురక అసలు ఎందుకు వస్తుంది..?
నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం మరియు శ్వాసని వదులుతున్నప్పుడు మెడ, తల లోని మృదుకణజాలం లో వైబ్రేషన్స్ కారణంగా గురక వస్తూ ఉంటుంది. అయితే ఈ సెన్సిటివ్ కణజాలము ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడు ఏం అవుతుంది అంటే వాయుమార్గం రిలాక్స్ గా ఉంటుంది ఆ సమయంలో గాలి చాలా బలవంతంగా లోపలికి వెళుతుంది. దీని మూలంగా కంపనాలు వస్తాయి.
గురక పెడుతుంటే ఈ సమస్యలు రావచ్చు:
#1. ప్రతి రోజు కనుక గురక పెడుతున్నట్టయితే కొన్ని ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#2. గురక ఎక్కువగా పెట్టే వాళ్లకి గుండె పోటు అధికంగా వస్తుందని పరిశోధన చెబుతోంది.
#3. అలానే గురక స్ట్రోక్ యొక్క ప్రమాదాన్ని 46 శాతం పెంచుతుంది.
#4. నోక్టురియాకు గురకకు కూడా సంబంధం వుంది రీసెర్చ్ చెబుతోంది.
#5. అంతే కాక గురక, శ్వాస సమస్యలు ఉంటే హైపర్టెన్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ వుంది.
ఈ టిప్స్ ని పాటిస్తే మంచిది:
#1. అధిక బరువు వలన గురక వస్తుంది కాబట్టి బరువును కంట్రోల్ చేసుకుంటే మంచిది.
#2. మీరు నిద్రపోయే పొజిషన్లో కూడా మార్పు చేసుకోండి. వీలైనంతవరకు పక్కకు తిరిగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది.
#3. ధూమపానం, మద్యపానంకి దూరంగా ఉంటే కూడా గురక రాదు.
#4. డీహైడ్రేషన్ కి గురవ్వకుండా ఎక్కువ నీళ్లు తీసుకుంటే గురక సమస్య నుండి బయట పడవచ్చు.
#5. డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండడం వలన కూడా గురక రాదు.
End of Article