ధంతేరాస్ రోజు ఈ 7 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు.. వీటికి అంత ప్రాధాన్యత ఎందుకంటే?

ధంతేరాస్ రోజు ఈ 7 వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు.. వీటికి అంత ప్రాధాన్యత ఎందుకంటే?

by Megha Varna

Ads

ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం త్రయోదశి నాడు ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజునే ధన్వంతరి త్రయోదశి అనీ, ధంతేరాస్ అని కూడా అంటుంటారు. ఈరోజు నుండే ఐదు రోజుల దీపావళి మొదలవుతుంది. అయితే మీరు మాత్రం ఈ ఏడు వస్తువులను అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ల పద్ధతిని అనుసరించి ఈ పండుగని జరుపుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసి ఆనందంగా ఉంటారు. ఇక ఈ సంవత్సరం అయితే నవంబర్ 2న ఈ పండుగ వచ్చింది. అయితే ఏం కొనాలి అనేది ఇప్పుడే చూద్దాం.

Video Advertisement

ఇత్తడి సామాన్లు:

ఇత్తడి చాలా మంచిది. సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవంతుడు వచ్చాడన్న సంగతి అందరికి తెలుసు. ఆ సమయంలో ఆయన చేతిలో అమృతంతో నిండిన ఇత్తడి కలశం వుంటుంది. అందుకని ఇత్తడి ప్రధానంగా కొనుగోలు చేస్తారు.

వెండి:

వెండి కూడా చాలా మంచిది. వెండి నాణెమైతే మరీ మంచిది మరియు శుభప్రదం కూడా. లక్ష్మీదేవి లేదా వినాయకుడిని ముద్రించిన నాణాన్నీ కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.

చీపురు:

చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ధన్తేరాస్ రోజున చీపురుని తీసుకొస్తే చాలా మంచి కలుగుతుంది. కనుక దీనిని కూడా మరచిపోకండి.

Vastu Tips: Use new broom on this auspicious day | Astrology News – India TV

అక్షతలు లేదా బియ్యం:

ఇంటికి బియ్యం వంటి వాటిని కూడా తీసుకువస్తే మంచిది. అందుకని ధన్తేరాస్ రోజున బియ్యం లేదా అక్షతలు తీసుకురండి.

Legacy vs price: Rice exports from Vietnam and India vie for ASEAN trade post-COVID-19

గోమతి చక్రం:

గోమతి చక్రం కూడా ఇంట్లో ఉంటే మంచిది. ఆరోగ్యంగా ఉండడానికి 11 గోమేధిక చక్రాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకు రండి. దీనిని ఒక పసుపు గుడ్డ లో కట్టి వాటిని మీ ఇంట్లో డబ్బులు ఉంచే చోట పెడితే చాలా మంచిది.

శ్రీ యంత్రం:

లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టం ఇది. దీపావళి రోజున దీనిని తెచ్చి పూజిస్తే చాలా మంచిది. కనుక శ్రీ యంత్రాన్ని కూడా కొనుగోలు చేస్తే మంచిది.

కొత్తిమీర గింజలు:

వీటిని కూడా తీసుకు వచ్చి మీరు ఇంట్లో వేయండి. ఈ గింజల ద్వారా వచ్చే కొత్తిమీర ఇంట్లో ఉంటే చాలా మంచి కలుగుతుంది.

Benefits of adding coriander seeds to your diet


End of Article

You may also like