Ads
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. బాహుబలి తర్వాత వచ్చే అనేక సినిమాలపై దర్శకధీరుడు రాజమౌళి ప్రభావం తప్పక ఉంటుంది. ఇటీవల విడుదలైన రణబీర్ కపూర్ నటించిన “షంషేరా” ట్రైలర్ చూస్తే కూడా అదే స్పష్టం అవుతుంది.
Video Advertisement
గతంలో బ్రదర్స్ మరియు అగ్నిపథ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కరణ్ మల్హోత్రా షంషేరాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళం మరియు తెలుగులో జూలై 22న విడుదలవుతుంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.
still from Shamshera trailer
షంషేరా 1871లో జరిగిన కథగా లొకేషన్స్, స్కేల్ అన్నీ బాగా ఆకట్టుకుంటాయి. షంషేరా సినిమాపై రాజమౌళి ప్రభావం స్పష్టంగా ఉన్నప్పటికీ ఇంతకు ముందు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” ను మరిచిపోలేము. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ మరియు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది.
still from Shamshera trailer
యశ్ రాజ్ ప్రొడక్షన్ మరోసారి భారీ బడ్జెట్ మూవీ నిర్మించింది. దీని కథ, కథనం చూసుకుంటే బాహుబలిని పోలి ఉంది. ఇందులో సంజయ్ దత్ విరోధి శుద్ధ్ సింగ్ పాత్రను పోషించాడు. వాణి కపూర్, రణబీర్ కపూర్ పాత్రతో ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తుంది. రణబీర్ మరియు సంజయ్ దత్ తండ్రి కొడుకులుగా ఉన్నారు. రణబీర్ కపూర్ ని చూస్తే.. ప్రభాస్ లాగా, సంజయ్ దత్ అచ్చం భల్లాల దేవ లాగా అనిపిస్తుంటే.. వాణి కపూర్ తమన్నాను తలపిస్తుంది. బాహుబలి పాన్ ఇండియా మూవీగా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలిని పోలిన షంషేరా కూడా ఆ స్థాయిలో హిట్ అయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
watch video :
End of Article