మితంగా ఉంటే వరం… అమితంగా ఉంటే విషం..! వీళ్ళ విషయంలో జరిగింది ఇదే..!

మితంగా ఉంటే వరం… అమితంగా ఉంటే విషం..! వీళ్ళ విషయంలో జరిగింది ఇదే..!

by Mohana Priya

Ads

చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు. భోజనం. మితంగా తింటే అమృతం. అమితంగా తింటే విషం. సినిమాలో భోజనం గురించి మాత్రమే చెప్పినా కూడా నిజ జీవితంలో ఇది చాలా విషయాలకి వర్తిస్తుంది. దాంట్లో సోషల్ మీడియా కూడా ఒకటి.

Video Advertisement

సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారు కూడా తెలియదు. ఏదో మాట్లాడి ఫేమస్ అయిపోతారు అంతే. సోషల్ మీడియా వల్ల ఎంతో మంది వెలుగులోకి కూడా వచ్చారు. అయితే ఏదైనా ఒక పాయింట్ తర్వాత లిమిట్ దాటినట్టు అనిపిస్తుంది.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

దాని వల్ల సమస్యలు ఎదురవుతాయి. యూట్యూబ్ లో కానీ, లేదా ఇంకా ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఏదైనా ఒక వ్యక్తి కాస్త డిఫరెంట్ గా మాట్లాడితే దాన్ని వీడియో క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాని మీద రీల్స్ చేయడం, దానికి డీజే మిక్స్ కూడా చేయడం, వాళ్లని ఫేమస్ చేయడం, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ కి వారిని తీసుకురావడం, ఇదంతా జరుగుతూనే ఉంది. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో ఒక వ్యక్తి, “నేను జడేస్తాను చూడు” అంటూ పాట పాడారు. ఆమె ఆ ఈవెంట్ లో పాట పాడినప్పుడు నిజంగా ఎవరు చూడలేదు.

trolls on jampalakadi jaru mithya song from ginna movie..

కానీ అదే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లక్షల మంది ఆ వీడియో చూసి, అప్పుడు యూట్యూబ్ లోకి వెళ్లి ఆమె పాడిన పాట మొత్తం చూశారు. కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి, “నేను లుంగీ వేస్తాను చూడు” అంటూ ఆమె పాడిన పాటకి ట్రెండ్ కి తగ్గట్టుగా పాడారు. అలాగే, ఒక బస్ కండక్టర్ పల్సర్ బైక్ అనే పాటకి డాన్స్ వేయడం, తర్వాత ఆ పాటని అందరూ యూట్యూబ్ లో చూడడం, ఆ పాట పాడిన సింగర్ రమణకి పేరు రావడం, అదే పాటని ధమాకా సినిమాలో కూడా వాడడం జరిగాయి.

ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎక్కడ చూసినా ఒక పాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ముందు, ” అంత పెద్ద హీరో ఇలాంటి రిఫరెన్స్ వాడటం ఏంటి?” అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం థియేటర్లలో ఆ పాటకి డాన్స్ కూడా చేస్తున్నారు. ఎవరో ఒక పెద్దాయన ఒక ఇంటర్వ్యూలో వాడిన కుర్చీ మడత పెట్టి అనే పదాన్ని పాటలాగా చేశారు. అది కూడా ఆ వ్యక్తి చెప్పిన మొత్తం సెంటెన్స్ వాడకుండా కేవలం కుర్చీ మడత పెట్టి అనే పదాన్ని వాడి, ఆ పదాన్ని ఒక డీజే మిక్స్ చేసిన వీడియో ఉంటే దాన్ని కూడా వాడి వాళ్ళని కూడా ఫేమస్ అయ్యేలాగా చేశారు.

ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా వీళ్ళందరికీ వరంగా మారింది. కానీ ప్రతిసారి ఇలాగే జరగదు. అందుకు ఇటీవల జరిగిన ఫుడ్ స్టాల్ సంఘటన ఉదాహరణ. ఎన్నో సంవత్సరాల నుండి అక్కడే ఫుడ్ స్టాల్ పెట్టి నడుపుకుంటున్న సాయి కుమారి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాక ఇప్పుడు రద్దీ పెరిగిపోయి, ట్రాఫిక్ జామ్ అయ్యి, పోలీసులు వచ్చి ఫుడ్ స్టాల్ ఆపేయాలి అనేంత వరకు వెళ్ళింది. ఆమె ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే సాయి కుమారి అమాయకురాలు అని తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న వారికి గుర్తింపు వచ్చింది అంటే వారికి కూడా ఆనందంగానే అనిపిస్తుంది కదా? సాయి కుమారి విషయంలో కూడా ఇలాగే జరిగింది.

తన పనికి గుర్తింపు లభిస్తున్నందుకు సంతోషపడ్డారు. కొంత మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇది అక్కడితో ఆగకుండా, ప్రతివారు ఆమె దగ్గరికి వెళ్లి, అంతకుముందు ఇంటర్వ్యూలలో కొంత మంది వేసిన ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. పబ్లిసిటీ కొంతవ రకు బాగానే ఉంటుంది. కానీ అది ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడప్పుడు హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. నిన్న సాయికుమారి ఒక పాయింట్ తర్వాత వాళ్ళకి అంత పబ్లిసిటీ ఇవ్వద్దు అని, దాని వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పారు. ఆమె చెప్పింది నిజమే కదా? కొంత వరకు అంటే వాళ్లు కూడా సంతోషపడతారు? కానీ ఇంత ఇబ్బంది కలిగే అంతగా పబ్లిసిటీ జరిగితే ఇలాంటి సమస్యలు వస్తాయి కదా?

సాధారణ ప్రజలు ఇలాంటివి ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు? కానీ శ్రమ ఊరికే పోదు అన్నట్టు, రేవంత్ రెడ్డి వారి ఫుడ్ స్టాల్ నడుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఏమైనా కూడా, దీనంతటికీ సోషల్ మీడియానే కారణం ఏమో. మొదట్లో కొన్ని ఇంటర్వ్యూ చేసి ఆపేస్తే వారి ఫుడ్ స్టాల్ అందరికీ తెలిసేది. వారికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేది. ఇంత ఇబ్బంది కూడా అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మరీ ఎక్కువగా రీల్స్ వంటివి కూడా చేయడం కారణంగా ఇలాంటి సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పటికైనా సాయి కుమారికి ఈ పబ్లిసిటీ మంచి చేస్తుంది అనుకుందాం.

విలేజ్ కుకింగ్ ఛానల్ అనే ఒక ఛానల్ వాళ్ళని విక్రమ్ సినిమాలో ఒక సీన్ కోసం తీసుకున్నారు. దాంతో తమిళ్ ఛానల్ అయినా వాళ్లు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ఇలాగే మన డైరెక్టర్ ఎవరైనా ఒక్క సీన్ కోసం సాయి కుమారిని తీసుకుంటే ఆమెకి మరింత ఫేమస్ చేసినట్టు అవుతుంది ఏమో. అలా అవ్వాలి అని కోరుకుందాం. ఎందుకంటే వారి కష్టానికి కూడా ఫలితం దక్కాలి కదా? అందుకే వాళ్లు కూడా ఇంకా అభివృద్ధి చెందాలి.

ALSO READ : కండక్టర్ అని కూడా చూడకుండా ఈ మహిళ వీరంగం..! ఇలా ప్రవర్తించడం ఏంటి..?


End of Article

You may also like