నేడే సూర్యగ్రహణం… ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! అవి ఏంటంటే..?

నేడే సూర్యగ్రహణం… ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! అవి ఏంటంటే..?

by kavitha

Ads

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఈరోజు (అక్టోబర్ 14)న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఈరోజు రాత్రి 8 గంటల 34 నిముషాలకు మొదలై, అర్ధరాత్రి 2 గంటల 25 నిముషాలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు.

Video Advertisement

దేశంలో గ్రహణం కనిపించకపోయినా, విదేశాలలో మాత్రమే కనిపించినా కూడా, గ్రహణ ప్రభావం తప్పకుండా  ఉంటుందని అంటున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల ఐదు రాశుల వారికి శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. మిథున రాశి:

ఈ సూర్యగ్రహణం వల్ల మిథున రాశికి చెందినవారికి శుభప్రదం అని, మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశివారు వారి కెరీర్‌లో కొన్నింటిలో సక్సెస్ పొందుతారట. మానసిక ప్రశాంతత కలుగుతుందట. వీరికి ఆర్థికంగా లాభపడే ఛాన్సులు ఉన్నాయని, ఆఫీసులో ఈ రాశి వారు చేసే వర్క్  ప్రశంసించబడుతుందని చెబుతున్నారు. సూర్య గ్రహణ టైమ్ లో ఆదిత్య హృదయం చదివితే శుభ ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
2. సింహరాశి: 

సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారు లాభాలను పొందవచ్చు. వీరు ఫ్యామిలితో సంతోషంగా గడుపుతారు. శత్రువులు ఈ రాశివారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు తలవంచరు. నేడు ఆదిత్య హృదయంతో పాటుగా, సూర్య జపం చేసుకుంటే శుభ ఫలితం ఉంటుంది.
simha-raashi3. తులారాశి: 

తులారాశి చెందిన వారికి ఈ సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సొసైటీలో వీరి స్థాయి పెరుగుతుంది. చేసే పనిలో సక్సెస్ ను సాధిస్తారు. అదృష్టం ఉంటే,పెండింగ్ లో ఉన్న పని సైతం పూర్తవుతుంది. వ్యాపారం చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది. గ్రహణ సమయంలో కేతు, రవి గ్రహాల జపాలు చేసుకుంటే మంచిది.
tula-raashi4. వృశ్చికరాశి:

ఈ రాశివారికి సూర్య గ్రహణం శుభప్రదంగా ఉంటుందని,  గ్రహణ ప్రభావం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి శ్రమ ఫలిస్తుంది. ఈ రాశివారు ఫైనాన్షియల్ గా లాభపడే అవకాశాలు, ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు నవగ్రహ జపం చేసినట్లయితే శుభ ఫలితం కలుగుతుంది.
vruchhika-raashi5. మకర రాశి:

మకర రాశి వారికి సూర్య గ్రహణం కలసివస్తుంది. ఈ సమయంలో వీరికి ఖర్చులు పెరిగినా, మరోవైపు నుండి ఆర్థికంగా  లాభాలు రావచ్చు. అదృష్టం ఈ రాశివారి వైపు ఉంటుంది. వీరు ఈ సమయంలో ఇల్లు, భూమి లేదా వాహనం కొనవచ్చు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
makara-raashiఈ ఐదు రాశుల పై నేడు వచ్చే సూర్యగ్రహణ ప్రభావంమూడు నెలల పదహారు రోజుల పద్దెనిమిది గంటల పాటు  ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Also Read: సనాతన ధర్మం, హిందూ ధర్మం… ఈ రెండు ఒకటే అనుకుంటాం..! కానీ ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందా..?


End of Article

You may also like