కొన్ని ఊర్ల పేర్ల చివర “పురం, పూర్” అని ఉంటుంది..? దాని వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?

కొన్ని ఊర్ల పేర్ల చివర “పురం, పూర్” అని ఉంటుంది..? దాని వెనుక ఇంత మ్యాటర్ ఉందా..?

by Sunku Sravan

Ads

మన భారతదేశంలో చాలా నగరాలు లేదా గ్రామాల పేర్లు చాలా వరకు కొన్ని అక్షరాలతో ముగుస్తాయి. అవి పురము లేదా పూర్ అనే అక్షరాలు..

Video Advertisement

ఈ ప్రత్యేకమైన పేర్లతో చాలా గ్రామాలు ఉన్నాయి పట్టణాలు కూడా ఉన్నాయి. మరి వాటి వెనక ఆ పురము లేదా పూర్ అని ఎందుకు ఉంటుంది.. ఎలా వచ్చిందో ఓ సారి చూద్దాం..?

నాగపూర్, జబల్పూర్, కాన్పూర్, జైపూర్, ఉదయపూర్, రాంపూర్, గోరక్ పూర్, ఫతేపూర్, సోలాపూర్, రాయపూర్, బిలాస్పూర్ ఇలా పలు నగరాల పేర్ల చివర పూర్ అనే పదంతో ముగుస్తాయి. వీటితో పాటుగా చాలా గ్రామాల చివర కూడా పురం అనే పేరు కూడా ఉంటుంది. రామాపురం, జక్కపురం, అనంతపురం, ఆత్రేయపురం నరసాపురం, ఇలా గ్రామాల పేర్లు కనిపిస్తూ ఉంటాయి.

మరి ఈ పూర్, పురం అనేది ఎక్కడి నుంచి ఉద్భవించిందో దాని అర్థం ఏమిటో ఓసారి చూడండి..? ఊరు పేర్ల చివర పూర్ అని పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. రాజస్థాన్ లో రాజా జై సింగ్ జైపూర్ ని స్థాపించిన కారణంగా ఆ పేరు వచ్చింది. పూర్ అనే పదాన్ని చాలా కాలంగా వివిధ స్థలాల, ప్రాంతాల పేర్ల కోసం వాడుతున్నారు. మహాభారతంలో కూడా హస్తినాపురం అనే పేరును మనం విని ఉన్నాం.

అయితే పూర్ అనే పదానికి నిపుణులు తెలియజేసిన అర్థం “పూర్ అంటే కోట లేదా నగరం.దీని గురించి ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఒక నిర్దిష్టమైన పేరు తర్వాత ఈ పూర్ ను చేరితే ఆ నగరానికి ఆ పేరు ఏర్పడుతుంది. కొంతమంది నిపుణులు ప్రకారం అరబిక్ భాష నుండి వచ్చిందని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో అనేక ప్రాంతాల్లో పూర్ అనే పదం వినిపిస్తుందని వారంటున్నారు.


End of Article

You may also like