ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే సగం ఫలితం పాటల్లోనే ఉంటుంది. పాటలు సూపర్ హిట్ అయితే సినిమా హిట్ కొట్టినట్టే. అందుకే దర్శకులు వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కొందరు ఫారెన్ లొకేషన్స్ కి వెళ్లేవాళ్లయితే.. మరి కొందరు ఉన్న చోటే భారీ సెట్స్ వేసి పాటలు తెరకెక్కిస్తారు.
Video Advertisement
ఇప్పుడు అలా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పాటలేంటో చూద్దాం..
#1 యంత్ర లోకపు సుందరివే..
శంకర్ దర్శకత్వం లో, రజని కాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం రోబో 2 . ఓ . ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో యంత్ర లోకపు సుందరివే పాటను 20 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
#2 ఊ అంటావా మావా..
సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇందులో సమంత ఒక ప్రత్యేక గీతం లో కనిపించింది. అదే ఊ అంటావా మావా.. ఈ పాత కోసం సమంత 5 కోట్ల పారితోషికం తీసుకుందని సమాచారం.
#3 కిలిమంజారో..
రోబో ఫస్ట్ పార్ట్ లో ఐష్ , రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన కిలిమంజారో పాట ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. దీనికి 4 కోట్ల బడ్జెట్ పెట్టారు.
#4 చమ్మక్ చల్లో..
షారుఖ్ ఖాన్, కరీనా జంటగా తెరకెక్కిన రా వన్ చిత్రం లో చమ్మక్ చల్లో చాలా ఫేమస్ అయ్యింది. దీని కోసం ఒక అమెరికన్ మ్యూజిషియన్ ట్యూన్స్ ఇచ్చారు. దీనికి రెండున్నర కోట్ల బడ్జెట్ అయ్యింది.
#5 బూమ్ బూమ్..
శంకర్ దర్శకత్వం లో తెరకెక్కించిన బాయ్స్ చిత్రం లో బూమ్ బూమ్ సాంగ్ సాంగ్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
#6 వారాయి..
చంద్రముఖి సినిమా క్లైమాక్స్ లో వచ్చే వారాయి సాంగ్ సూపర్ హిట్ అన్న విష్యం తెలిసందే. దీని కోసం ఆ కోట మొత్తాన్ని భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి సెట్ వేశారు.
#7 పువ్వుల్లో దాగున్న..
జీన్స్ చిత్రం లో సూపర్ హిట్ పాట అయినా ‘పువ్వుల్లో దాగున్న’ సాంగ్ ని ప్రపంచం లోని అన్ని వింతలు ఉన్న ప్రదేశాల్లో చిత్రీకరించారు. దీనికి శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
#8 వాజీ వాజీ..
శంకర్ తెరకెక్కించిన శివాజీ మూవీ లో ‘ వాజీ వాజీ..’ పాట కోసం 3 కోట్ల తో సెట్ వేశారు మేకర్స్.
#9 లేడీయో..
విక్రమ్, అమీజాక్సన్ జంటగా శంకర్ తెరకెక్కించిన ‘ఐ’ మూవీ లో లేడీయో.. సాంగ్ ని 5 కోట్ల తో తెరకెక్కించారు.
#10 ఆర్ సి 15
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం లో ఆర్ సి 15 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం లో 8 కోట్ల రూపాయలతో ఒక పాట చిత్రీకరించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మరో పాటను 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో న్యూజిలాండ్ లో పాటను షూట్ చేయనున్నట్లు సమాచారం.