Ads
సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఔదార్యం గురించి ఇప్పటికే ఎన్నో కధనాలు ప్రసారం అయ్యాయి. గత రెండు, మూడు రోజులుగా ఆయన ఇంట్లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు కూడా రెండో సారి ఐటి రైడ్స్ జరుగుతాయి అంటూ వార్తలు రావడంతో నెటిజన్స్ కొంత అయోమయానికి గురి అయ్యారు. మరో వైపు సోను అభిమానులు మాత్రం.. ఆయన పట్ల తమ ప్రేమను ప్రకటిస్తూనే ఉన్నారు.
Video Advertisement
సోనూసూద్ ఎంతో మందికి సేవ చేసారని.. ఎంతో మంది కుటుంబాలను కరోనా గడ్డు కాలంలో ఆడుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఏ ప్రభుత్వం అందించలేని సేవలని సైతం సోనూసూద్ అందించారని.. ఆయనను ఎవ్వరు ద్వేషించలేరు అంటూ.. పలు కామెంట్స్ చేస్తూ నెటిజన్లు తమ అభిమానాన్ని పంచుకున్నారు. దాదాపు ఇరవై కోట్ల రూపాయల టాక్స్ ను సోనూసూద్ ఎగ్గొట్టారు అన్న ఆరోపణలు వస్తున్న క్రమంలో సోను స్పందించారు.
“కఠినమైన రహదారుల్లో కూడా ప్రయాణం సుఖంగా ఎలా చేయాలో కనుక్కున్నామని.. ప్రతి భారతీయుని ప్రార్ధన ఫలిస్తుంది” అని సోనూసూద్ ట్వీట్ చేసారు. ఐటి రైడ్స్ తాలూకు వివరణను కూడా ఆయన ఓ ఫోటోతో సమాధానం ఇచ్చారు. ప్రతి సారి నీవైపు కథని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. భారతీయులకు చేయగలిగినంత సేవ చేయాలని నాకు నేనే ప్రతిజ్ఞ చేసుకున్నా.. నా ఫౌండేషన్ కు క్రెడిట్ అయిన ప్రతి రూపాయి ఓ విలువైన ప్రాణాన్ని కాపాడడానికి ఎదురు చూస్తూనే ఉంది..
ఎన్నో సందర్భాలలో నేను సేవ చేయడం కోసమే.. ఎన్నో బ్రాండ్స్ ను ఎంకరేజ్ చేశాను. అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది అతిధులకు ఆతిధ్యం ఇస్తుండడం వలన గత నాలుగు రోజులుగా మీ సర్వీస్ లో గ్యాప్ వచ్చింది. తిరిగి అదే ఉత్సాహం తో.. అదే సేవ చేయాలన్న సంకల్పంతో మీ ముందు మళ్ళీ వస్తా.. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది..” అంటూ సోనూసూద్ తన అభిమానులకు సుదీర్ఘ లేఖను రాసారు. ఆయన ఈ సమస్యలన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని తిరిగి తన లక్ష్యాన్ని సాధించాలని కోరుకుందాం.
“सख्त राहों में भी आसान सफर लगता है,
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY— sonu sood (@SonuSood) September 20, 2021
End of Article