ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో… ట్రోలింగ్‌కి గురైన 6 సౌత్ ఇండియన్ స్టార్స్..!

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో… ట్రోలింగ్‌కి గురైన 6 సౌత్ ఇండియన్ స్టార్స్..!

by Anudeep

Ads

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఏం మాట్లాడినా అందరికి చేరుతుంది. అందుకే వారి ఆచితూచి మాట్లాడతారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు వివాదాల జోలికి పోకపోయినా, కొన్ని వివాదాలు అనుకోని పరిస్ధితుల్లో వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి.

Video Advertisement

మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి నిన్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు అనేక మంది వివాదాల్లో చిక్కుకున్న వాళ్లే. వాళ్లంతా ఎందుకు ట్రోల్ చేయబడ్డారో ఒకసారి చూద్దాం..

#1. మహేష్ బాబు

సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ నటించే ఆసక్తి లేదు, అందుకే హిందీ సినిమాలు చేయడం ఇష్టం లేదని చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనం సృష్టించింది. అతను క్లారిటీ ఇచ్చినప్పటికీ, అతను ట్రోలింగ్‌లకు కేంద్రబిందువయ్యాడు. కొందరు నెటిజన్లు మహేష్ కి అహంకారము అని, గర్వం ఎక్కువ అని విమర్శించారు. దీనికి సంబంధించి ఓ వ్యాఖ్య కూడా ఉంది.. ‘దీనినే గర్వం అంటారు, నేను అతని పట్ల నా గౌరవాన్ని కోల్పోయాను. మీకు నచ్చినది చేయండి, అయితే ఇతరులను కించపరచకండి.’

#2. అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు కొదవే లేదు. అయితే ఇటీవల అతని అనుమతి లేకుండా తీసిన ఓ ఫోటోతో అతను ట్రోల్ కి గురయ్యాడు. నీలిరంగు టీ షర్టు, నల్లటి ప్యాంటులో కనిపించాడు. కొందరు అతనిని బాడీ-షేమ్ చేసారు మరియు ‘వడా పావ్’ అని, ఇంకొన్ని పేర్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. గతంలో కూడా సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు.

#3. జూనియర్ ఎన్టీఆర్

akhanda jai balayya hook step copied from a jr ntr song

 

ఆర్ఆర్ఆర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఓ సిక్స్ ప్యాక్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు తీవ్రంగా ట్రోల్ చేశారు. అభిమానులు అతని అబ్స్ ఫేక్ అని విమర్శించారు. ‘ఒక నెలలో సిక్స్ ప్యాక్ పొందడానికి, ఈరోజే ఫోటోషాప్ క్రాష్ కోర్సులో చేరండి’ అని వ్యాఖ్యానించారు.

#4. నివిన్ పౌలీ

కనకం కామిని కలహం అనే చిత్రంలో సహ నటుడు గ్రేస్ ఆంటోనీతో కలిసి నటించాడు నివీన్ పౌలీ. ఆ చిత్రంలో నివిన్ శరీరాకృతిని ట్రోల్ చేశారు. చాలామంది నెటిజన్లు బరువు పెరగడంపై ఆయనపై విమర్శలు గుప్పించారు.

#5. సాయి పల్లవి

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సాయి పల్లవి మాట్లాడుతూ, ‘కాశ్మీరీ పండిట్‌లను ఆ సమయంలో ఎలా చంపారో కాశ్మీర్ ఫైల్స్ చూపించాయి. మీరు ఈ అంశాన్ని మతపరమైన వివాదంగా తీసుకుంటే, ఆవులను రవాణా చేస్తున్న ముస్లిం డ్రైవర్‌ను కొట్టి, ‘జై శ్రీరామ్’ అని బలవంతం చేసిన సంఘటన ఇటీవల జరిగింది. అయితే ఈ రెండు సంఘటనల మధ్య తేడా ఎక్కడ ఉంది అనే మాటలు ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. సాయి పల్లవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడ్డాయి. దీంతో ఆమె తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

#6. సమంత

సమంత ఇటీవల మద్యం కంపెనీకి బ్రాండ్‌గా ఉన్నందుకు ట్రోల్ చేయబడింది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో వాణిజ్య ప్రకటనను పంచుకోవడంతో, నెటిజన్లు మద్యాన్ని ప్రచారం చేసినందుకు ఆమెను ట్రోల్ చేశారు. ఆమె వీడియోపై ఒక వ్యాఖ్య ఇలా ఉంది.. ‘మీరు ఈ విషయాలను ప్రోత్సహించకూడదు.’


End of Article

You may also like