మూడు తరాలను తన గానంతో ఓలలాడించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఐదు పదేళ్ళు కాదు ఏకంగా యాబై సంవత్సరాల పాటు తన పాటతో అలరించిన స్వరమహర్షి బాలు. అటువంటి అద్భుతమైన గాయకుణ్ని ఎలా సత్కరించిన, ఎంత పొగిడినా బాలసుబ్రమణ్యం చేసిన కృషికి తక్కువే అవుతుంది.

Video Advertisement

బాలసుబ్రమణ్యం నెల్లూరులో జన్మించారు. ఆయన చెన్నైలో సెటిల్ అయినా తన గాన మాధుర్యంతో యావత్ భారతాన్ని మెప్పించి, అందరివాడిగా మారారు. సంగీతంలో అక్షరాలు తెలియని మామూలు వ్యక్తి  ఇలాంటి కీర్తి శిఖరాలును చేరుకుంటాడని ఎవరూ కూడా ఊహించలేదు. ఆయన ఎంతో కృషి చేసాడు కాబట్టే సంగీత ప్రియుల హృదయాలలో శాశ్వతమైన  స్థానాన్ని పొందారు. మరికొన్నేళ్ళు ఆయన తన గాన మాధుర్యంతో అలరిస్తారని భావించిన టైమ్ లో ఆయన గొంతు మూగబోయింది. కరోనా బారిన పడి ట్రీట్మెంట్ పొందుతూ బాలు కన్ను మూశారు.
బాలు తండ్రి హరికథా కళాకారుడు అవడంతో ఆయన సంగీతం పై ఆసక్తిని ఏర్పరుచుకున్నారు. అయితే బాలు తన తల్లీ ఇష్టం మేరకు ఇంజనీరింగ్‌లో చేరారు. అయినప్పటికీ పాటల పోటీలలో పాల్గొనేవారు. 1964లో ఆయన మొదటి అవార్డు అందుకున్నారు. అనంతరం ఇళయరాజాతో కలిసి మ్యూజిక్ బ్యాండ్‌ ను మొదలుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌పీ కోదండపాణి బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇచ్చారు. పైన కనిపిస్తున్న ఫోటో అప్పుడు తీసినదే. ఆ సమయంలో వారు ఒక గాన గంధర్వుడుని సంగీత ప్రపంచానికి అందిస్తున్నామని అనుకోని ఉండరేమో. పైన  ఫోటోలో బాలుకి షేక్ హ్యాండ్ ఇస్తున్న వ్యక్తి అప్పటి హాస్యనటుడు పద్మనాభం. ఇక బాలుకి ఎడమ వైపు ఉన్నవ్యక్తి  మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ పి కోదండ పాణి. ఈ ఇద్దరు బాలసుబ్రమణ్యంకు తొలి అవకాశం ఇచ్చారు. పద్మనాభం ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ‘శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాలో బాలు మొదటి పాటను పాడారు.Also Read: కీర్తి సురేష్ “మహానటి” నుండి… రామ్ చరణ్ “రంగస్థలం” వరకు… IMDB ప్రకారం “తెలుగు” లో వచ్చిన 15 బెస్ట్ సినిమాలు ఇవే..!