“బాలు గారు ఎప్పటికి పాటల రూపంలో మాతోనే ఉంటారు” అంటూ ఓ అభిమాని రాసిన ఎమోషనల్ లెటర్.!

“బాలు గారు ఎప్పటికి పాటల రూపంలో మాతోనే ఉంటారు” అంటూ ఓ అభిమాని రాసిన ఎమోషనల్ లెటర్.!

by Sainath Gopi

Ads

ఒక శకం ముగిసింది. శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు ఇవాళ మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డు ను అందుకున్నారు.

Video Advertisement

ఇవే కాకుండా 53 సంవత్సరాల సినీ ప్రస్థానం లో ఇంక ఎన్నో అవార్డులను, అలాగే ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అలాగే పాడుతా తీయగా వంటి కార్యాక్రమాల ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించారు. ఎందరో నటులకి కెరీర్ లో గుర్తుండిపోయే పాటలను ఇచ్చారు.

అలాగే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో కలిసి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఒక టైం లో అసలు బాలు గారు పాడని సినిమా లేదు. తెలుగు లో బాలు గారు చివరిగా పలాస 1978 సినిమా లో పాట పాడారు.

మీరు మాకు పరిచయం లేకపోవచ్చు. మేము ఎవ్వరం మీకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. కానీ మీరు మాకు మా ఇంట్లో మనిషి అంత దగ్గరి వారిలా అనిపిస్తారు. ఇప్పటికి కూడా మీరు భౌతికం గా మాతో లేకపోయినా కూడా మీ మాటల రూపం లో, మీ పాటల రూపం లో ఎప్పటికి మాతోనే ఉంటారు.

కానీ మీ పాట విన్నప్పుడల్లా ఇంక మీ గొంతు మళ్ళీ వినలేము అన్న విషయం గుర్తొస్తుంది. మీరు ఇంక లేరు అనే విషయం అబద్ధం అయితే బాగుండు అని అనిపిస్తుంది. మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎంతో మంది జీవితం లో మీ పాటలు ఉంటాయి.

మీరు వెనక్కి వస్తే బాగుండు అనిపిస్తుంది. మీ ఆత్మకి శాంతి కలగాలి అని ప్రార్థిస్తున్నాం. భారతీయ సినిమా రంగం ఉన్నంత వరకు అందులో మీ పేరు కచ్చితం గా ఉంటుంది. సంగీతం లో మీకంటూ కొన్ని పేజీలు తప్పకుండా ఉంటాయి.

మిమ్మల్ని స్ఫూర్తి గా తీసుకున్న గాయకులు, మీతో కలిసి పనిచేసిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యలు, స్నేహితులు, మీ పాటలు వింటూ, మిమ్మల్ని చూస్తూ పెరిగిన కోట్లాది అభిమానుల హృదయాల్లో మీరు ఎప్పటికి ఉంటారు. ఇంత కాలం మమ్మల్ని అలరించినందుకు, అలాగే ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుంచుకునే జ్ఞాపకాలను మీ స్వరం, సినిమాల రూపం లో ఇచ్చినందుకు థాంక్ యు.


End of Article

You may also like