Ads
ఎన్నో హిట్ పాటలు పాడి గుర్తింపు సంపాదించుకున్న గాయకుడు శ్రీరామ చంద్ర. శ్రీరామ చంద్ర ఒక నటుడు కూడా. అంతకుముందు ఒక సినిమాలో నటించిన శ్రీరామ చంద్ర, ఇప్పుడు పాపం పసివాడు అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
Video Advertisement
ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ విషయానికి వస్తే, క్రాంతి (శ్రీరామ చంద్ర), డింపీ (గాయత్రి చాగంటి) అని అమ్మాయితో ఆరేళ్లు ప్రేమలో ఉంటాడు. తర్వాత పెళ్లి చేసుకుందాం అని క్రాంతి అడిగిన తర్వాత డింపీ రిజెక్ట్ చేస్తుంది.
బ్రేకప్ అవ్వడంతో క్రాంతి చాలా బాధపడి దేవదాసులాగా మారిపోతాడు. ఇంట్లో పెళ్లి గోల పెరిగిపోతుంది. ఇది తట్టుకోలేక క్రాంతి ఇల్లు వదిలేసి బయట తన స్నేహితులతో ఉంటాడు. ఒక రోజు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ చారు (రాశి సింగ్) ని చూస్తాడు. చారుని వెతుకుతూ ఉంటాడు. కానీ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో అనూష (శ్రీవిద్య) తో క్రాంతికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో చారు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
సరదాగా సాగిపోయే ఈ సిరీస్ కి లలిత్ కుమార్ దర్శకత్వం వహించారు. సిరీస్ కథ చాలా సింపుల్ గా ఉంటుంది. తెలిసిన కథ. కానీ టేకింగ్ బాగుంది. సిరీస్ మొత్తం కామెడీతో నడుస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. టెక్నికల్ గా కూడా సిరీస్ బాగుంది. ఒక్కొక్క ఎపిసోడ్ కూడా 30 నిమిషాల కంటే తక్కువే ఉంటుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.
ముఖ్యంగా హీరోకి, హీరో తల్లికి మధ్య వచ్చే సీన్స్ కామెడీగా రాసుకున్నారు. శ్రీరామ చంద్ర కూడా క్రాంతి పాత్రలో చాలా బాగా చేశారు. అక్కడక్కడ ఒకటి, రెండు సీన్స్ కట్ చేస్తే సిరీస్ అంతా కూడా కుటుంబంతో కలిసి చూడదగ్గ విధంగానే ఉంది. ముఖ్యంగా యువతరాన్ని, వారు ఎదుర్కొనే సంఘటనలని, సమస్యలను ఇందులో చూపించారు కాబట్టి ఈ సిరీస్ ఎక్కువగా యూత్ ని ఆకట్టుకుంటుంది.
watch trailer :
ALSO READ : “మ్యాడ్” మూవీలో “DD” క్యారెక్టర్ లో నటించిన హీరో ఎవరో తెలుసా..?
End of Article