దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. శ్రీలీల తాజాగా రవితేజ సరసన ధమాకాలో నటించారు. ఆ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. అందం తో పాటు అభినయం, డాన్స్ లో కూడా అదరగొడుతున్న శ్రీలీల కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
Video Advertisement
టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే ఉంటుంది. దీనికి కారణం తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. పెళ్లి సంద D చిత్రం లో శ్రీలీల గ్లామర్, అభినయం అందర్నీ ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా వచ్చిన ధమాకా చిత్రంలో డ్యాన్సులు, స్టెప్పులతో మాస్ పాటలను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు సాధించడంలో కీలక పాత్రను పోషించింది.
దీంతో శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులతోపాటు స్టార్ హీరోల పక్కన అవకాశాలు సంపాదించింది. ప్రస్తుతం ఆమె చేతిలో 8 చిత్రాలున్నాయి. ప్రస్తుతం శ్రీలీల రామ్ పోతినేని, బోయపాటి చిత్ర షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే జూనియర్ అనే కన్నడ, తెలుగు భాషల్లో వస్తున్న చిన్న చిత్రంలో నటించింది. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ తదుపరి చిత్రంలో.. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల.
ఇవి కాకుండా అనధికారికంగా మీడియాలో వినిపిస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న VD12 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రోజు సినిమాలో చిత్రంలో నటించనున్నారు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే నితిన్, వక్కాంతం వంశీ చిత్రంలో కూడా నటించబోతున్నదనే విషయం మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దీంతో చాలా తక్కువ సమయం లోనే పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. తన తొలి చిత్రానికి 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీలీల.. ధమాకా చిత్రానికి 50 లక్షలు తీసుకుంది. ఇక ఆ సినిమా హిట్ కావడం తో తన రెమ్యూనరేషన్ ని 3 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.