శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు..! మహాకవి అని అందుకే అంటారు ఏమో..!

శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు..! మహాకవి అని అందుకే అంటారు ఏమో..!

by Harika

Ads

శ్రీరంగం శ్రీనివాసరావు. మహాకవి అనే బిరుదు పొందిన మహానుభావులు. శ్రీరంగం శ్రీనివాసరావు గారిని శ్రీ శ్రీ అని అంటారు. అదే పేరుతో ఆయన గుర్తింపు పొందారు. ఏప్రిల్ 30వ తేదీ, 1910 లో ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంలో శ్రీ శ్రీ జన్మించారు. శ్రీ శ్రీ తల్లిదండ్రులు పూడిపెద్ది వెంకట్రమణయ్య మరియు ఆటప్పకొండ. ఆ తర్వాత శ్రీ శ్రీని శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తత తీసుకున్నారు. విశాఖపట్నంలో ప్రైమరీ విద్యాభ్యాసం చేసిన తర్వాత 1931 లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో బిఎ ఆనర్స్‌లో పట్టా పొందారు.

Video Advertisement

sri sri quotes in telugu

1935 లో విశాఖపట్నంలోని ఎస్ వి ఎస్ కాలేజ్ లో డెమోన్స్ట్రేటర్ గా కెరీర్ మొదలుపెట్టి, 1938లో ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలో, హైదరాబాద్ లో, ఆంధ్ర వాణి అనే ఒక డైలీ పత్రికలో కూడా పనిచేశారు. శ్రీ శ్రీ కి సరోజినీ గారితో పెళ్లి జరిగింది. వారికి మాల శ్రీనివాసరావు, మంజుల శ్రీనివాసరావు, మంగళ శ్రీనివాసరావు అనే కూతుళ్ళతో పాటు, వెంకట్ శ్రీనివాసరావు అనే కొడుకు కూడా ఉన్నారు. శ్రీ శ్రీ ఎంత పెద్ద సాహితీవేత్త అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కలం నుండి జాలువారిన కొన్ని ఆణిముత్యాలు ఇవే.

#1 నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను.

#2 నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్.

#3 ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.

#4 మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి. ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా. చావండి. నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా. రారండి.

#5 ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.

#6 కుదిరితే పరిగెత్తు. లేకపోతే నడువు. అదీ చేతకాకపోతే పాకుతూ పో. అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.

#7 కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో.

#8 న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కాని గెలిచిందంతా న్యాయం కాదు.

ఇవే కాదు. ఇంకా ఎన్నో గొప్ప కవిత్వాలని శ్రీ శ్రీ రాశారు. అందుకే ఆయనని ఇప్పటికీ అందరూ స్మరించుకుంటూ ఉంటారు.

ALSO READ : “పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు..!


End of Article

You may also like