“శ్రీదేవి సోడా సెంటర్” హీరోయిన్ రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.?

“శ్రీదేవి సోడా సెంటర్” హీరోయిన్ రియల్ లైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా.?

by Mohana Priya

Ads

సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించారు. అలాగే సీనియర్ నటుడు నరేష్ గారు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి పలాస సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ కుమార్ దర్శకత్వం వహించారు, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, Aanandi Marriage and Family టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో నటించిన ఆనంది మన తెలుగు అమ్మాయి. Aanandi

Video Advertisement

zombie reddy fame anandhi

వరంగల్ కి చెందిన ఆనంది ఆట ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నారు. ఆనంది అసలు పేరు రక్షిత. 2012 లో వచ్చిన ఈ రోజుల్లో సినిమాతో మొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించారు. తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించారు. ఆ తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో, వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

zombie reddy fame anandhi

నాయక్ సినిమాలో బ్రహ్మానందం గారు పెళ్లి చూపులు చూడడానికి వెళ్లే అమ్మాయిగా, రఘు బాబు చెల్లెలిగా నటించారు ఆనంది. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ అనే సినిమాలో కనిపించారు. తర్వాత 2014 నుంచి వరుసగా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో కయల్, త్రిష ఇల్లనా నయనతార, విసారణై, పరియేరుమ్ పెరుమాళ్ సినిమాలు ఆనందికి ఎంతో పేరు తెచ్చాయి.sridevi soda center actress anandhi

మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత జాంబి రెడ్డి తో డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించారు ఆనంది. జనవరి 7వ తేదీ 2021 లో వరంగల్ లో సోక్రటీస్ తో ఆనంది వివాహం జరిగింది. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మన ముందుకు వచ్చారు ఆనంది. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో శ్రీదేవి పాత్రలో నటించిన ఆనందికి మంచి మార్కులే పడ్డాయి.


End of Article

You may also like