బిగ్ బాస్ 6 తెలుగు: టికెట్ టు ఫినాలే గెలిస్తే.. ఫైనల్లో ఫలితం ఎలా ఉంటుంది అంటే..??

బిగ్ బాస్ 6 తెలుగు: టికెట్ టు ఫినాలే గెలిస్తే.. ఫైనల్లో ఫలితం ఎలా ఉంటుంది అంటే..??

by Anudeep

బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్‌లో 13వ వారం వచ్చేసరికి హౌస్‌లో 8 మంది సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ ఎనిమిది మందిలో మరో ముగ్గురు ఈ వారం, వచ్చేవారాల్లో ఎలిమినేట్ కాబోతున్నారు. మొత్తంగా టాప్ 5కి వెళ్లేది ఐదుగురే. అయితే వీరిలో ఒకరికి ఓటింగ్‌తో.. నామినేషన్స్.. ఎలిమినేషన్స్‌తో సంబంధం లేకుండా టాప్ 5కి వెళ్లే ఛాన్స్ లభిస్తుంది. అయితే ఈ సీజన్ లో టికెట్ టు ఫినాలే శ్రీహన్ గెలుచుకున్నాడు.

Video Advertisement

 

రేవంత్, శ్రీహాన్‌ టికెట్ టు ఫినాలే ఫైనల్ ఫైట్‌లో పోటీపడగా.. శ్రీహాన్ గెలిచి, సీజన్ 6 తొలి ఫైనలిస్ట్‌ అయ్యాడు. నిజానికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండి, ఫెయిర్ గేమ్ ఆడుతున్న వాళ్ళకి టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. అయితే ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో టికెట్ టు ఫినాలే గెలిచిన కంటెస్టెంట్స్ ఎవరు? వాళ్లకి ఈ టికెట్ టు ఫినాలే ద్వారా కలిసి వచ్చింది ఏంటి? అనేవి ఇప్పుడు చూద్దాం..

srihan won the ticket to finale in biggboss season 6..

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్‌లో హరితేజ, ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ, అర్చనలు ఫైనల్‌కి వెళ్లారు. అయితే ఫస్ట్ సీజన్ జరిగింది 71 రోజులే కావడంతో .. అందరూ ఓటింట్ ద్వారా మాత్రమే ఫైనల్‌కి వెళ్లారు. టికెట్ టు ఫినాలే ఫస్ట్ సీజన్‌లో లేదు.

srihan won the ticket to finale in biggboss season 6..

రెండో సీజన్ నుంచి ఈ ‘టికెట్ టు ఫినాలే’ వెలుగులోకి వచ్చింది. సీజన్‌లో కౌశల్ విన్నర్ కాగా.. అప్పుడు హౌస్‌లో ఉన్న సామ్రాట్‌ ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకుని ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. మూడో సీజన్‌ 93వ ఎపిసోడ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌ టికెట్ టు ఫినాలే గెలుచుకుని.. సీజన్ 3 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అలాగే ఆ సీజన్ విన్నర్ కూడా అయ్యాడు.

srihan won the ticket to finale in biggboss season 6..

ఇక నాలుగో సీజన్ విషయానికి వస్తే.. అఖిల్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుని సీజన్ 4 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఫైనల్ గా రన్నర్ గా మిగిలాడు. ఐదో సీజన్ విషయానికి వస్తే.. టికెట్ టు ఫినాలే టాస్క్‌ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగింది. మానస్, శ్రీరామ్‌లో ‘టికెట్ టు ఫినాలే’ కోసం పోటీ పడ్డారు. వీళ్లిద్దరికీ ఇచ్చిన ఫిజికల్ టాస్క్‌లో మానస్‌కి అదృష్టం కలిసిరాకపోవడంతో ఓడిపోవాల్సి వచ్చింది. శ్రీరామ్ ఈ టాస్క్‌లో గెలిచి టికెట్ టు ఫినాలే అందుకున్నాడు. అయితే శ్రీ రామ్‌కి కాళ్లు బాలేకపోవడంతో.. శ్రీరామ్ తరుఫున సన్నీ, షణ్ముఖ్‌లు టాస్క్‌లు కంప్లీట్ చేసి శ్రీరామ్‌ని గెలిపించారు.

srihan won the ticket to finale in biggboss season 6..

ఈ 5 సీజన్స్ గమనిస్తే టికెట్ టు ఫినాలే గెలిచిన వారిలో రాహుల్ సిప్లిగంజ్ మినహా ఎవరు టైటిల్ గెలవలేదు. అయితే ఈ సీజన్ లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీహన్ తనకన్నా బలంగా ఉన్న ఇతర కంటెస్టెంట్లను దాటి టైటిల్ గెలవగలడా అన్నది ప్రశ్నార్థకమే..!!


You may also like

Leave a Comment