ఆ ఒక్క కల నెరవేరకుండానే శ్రీహరి లోకాన్ని వీడి వెళ్లిపోయారు.. అదేంటంటే..?

ఆ ఒక్క కల నెరవేరకుండానే శ్రీహరి లోకాన్ని వీడి వెళ్లిపోయారు.. అదేంటంటే..?

by Anudeep

Ads

శ్రీహరి గారు భౌతికంగా దూరమై ఎన్నేళ్ళైనా.. ఆయన ఇంకా మన మధ్యే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూస్తున్నంత సేపు ఆయన ఇంక లేరు అంటే నమ్మబుద్ధి కాదు. 2013 అక్టోబర్ 9 న శ్రీహరి గారు కన్నుమూశారు. నేటికి ఆయన మరణించి ఎనిమిదేళ్లు కావొస్తోంది. కేవలం నటుడిగానే కాదు, మంచి మనిషి గా కూడా శ్రీహరి అందరికి గుర్తుండిపోయారు.

Video Advertisement

srihari 1

ఆయన వద్దకు ఎవరైనా సాయం కోరి వస్తే.. కాదనకుండా చేసి పెట్టేవారు. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయం లో ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడంతో ఇటు టాలీవుడ్, అటు శ్రీహరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. శ్రీహరికి శారీరక ధారుడ్యం పై అమితాసక్తి ఉండేదట. చిన్నప్పటినుంచే శరీరం ఫిట్ నెస్ పై దృష్టిపెట్టేవారట. అలాంటి పోటిల్లోకి కూడా వెళ్లేవారట.

srihari 2

చిన్నతనంలోనే ఏడుసార్లు ‘మిస్టర్ హైదరాబాద్” గా గెలుపొందారట. రెండుసార్లు జాతీయ స్థాయిలో కూడా బహుమతులు గెలుపొందారు. జిమ్నాస్టిక్స్ లో రాష్ట్ర ఛాంపియన్ అయ్యారు. ఆయన మంచి అథ్లెట్ అవ్వాలని కలలుగనేవారట. అయితే నటనపై మక్కువతో.. ఆయన సినిమాలవైపుకు వచ్చారట. సినిమాల్లో బిజీ అయిపోవడం తో ఏషియన్ గేమ్స్ లో భారత్ తరపున ఆడాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన కోరిక తీరకుండానే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. భౌతికంగా శ్రీహరి మన మధ్య లేకున్నా.. ఆయనను మనం మరచిపోలేము.


End of Article

You may also like