చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి మనకి తెల్సిందే. ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె మొదటి వివాహాం విడాకులతో ముగిసింది. మొదటి భర్త వల్ల నివృత్తి పుట్టింది. రెండో భర్త వల్ల నవిష్క పుట్టింది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె తన ఏందో భర్త కళ్యాణ్ దేవ్ తో దూరం గా ఉంటున్నారు. ప్పుడు శ్రీజ రెండో పెళ్లి కూడా విడాకుల వరకు వెళ్లిందని, అందుకే వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

 

 

సంతోషంగా కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నానంటూ… 2023కి వెల్కమ్ చెబుతూ… శ్రీజ కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. కొత్త ఏడాదిలోకి మాత్రమే కాదు… కొత్త వ్యక్తిని కలవడంతో పాటు, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టు ఆ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పోస్ట్ చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

srija konidela new post goes viral..!!

వైరల్ గా మారిన ఆ పోస్ట్ లో శ్రీజ .. “డియర్ 2022, నా జీవితంలోని అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని తెలిసేలా చేశావ్.. అందుకే థాంక్స్.. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి.. నన్ను బాగా, అమితంగా ప్రేమించే వ్యక్తి.. నన్ను ఎప్పుడూ కేరింగ్‌గా చూసుకునే వ్యక్తి.. నాకు సపోర్టివ్‌గా ఉండే వ్యక్తి.. నా కష్టసుఖాల్లో తోడుండే వ్యక్తి.. డియర్ మీ.. చివరకు నిన్ను కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది.. కొత్త ప్రయాణం మొదలు..” అంటూ శ్రీజ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

srija konidela new post goes viral..!!

అయితే తనలోని తనను గుర్తించానని, తనను తన కంటే ఎవ్వరూ బాగా అర్థం చేసుకోలేరని ఇలా పరోక్షంగా చెప్పేసింది శ్రీజ. మొత్తానికి శ్రీజ ఇకపై ఒంటరిగానే ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే న్యూ ఇయర్ రోజు అలంటి పోస్ట్ పెట్టింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ అయితే కళ్యాణ్ దేవ్‌కు దూరంగా ఉంటోంది. తమ కుమార్తె నవిష్కను సైతం శ్రీజ తన వద్దే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది.