మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Video Advertisement

 

అయితే వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన నువ్వు శ్రీదేవి అయితే.. ఆ ఆయితే నేనే చిరంజీవి అవుతా .. అంటూ సాగే పాటను ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆసక్తికర వీడియోను షేర్ చేసుకున్నారు చిరు. అయితే ఈ సాంగ్ షూటింగ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది శృతి హాసన్.

 

sruthi hasan comments about sridevi -chiranjeevi song..
తాజాగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ” శ్రీదేవి చిరంజీవి పాట నాకెంతో నచ్చినా, చిత్రీకరణను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నిజాయతీగా చెప్పాలంటే మరోసారి ఇలా చీర ధరించి మంచులో ఉండే పాట చేయకూడదని భావిస్తున్నా. ఎందుకంటే, ఆ పాటకోసం ముఖ్యంగా చీరలో ఆ వాతావరణంలో డాన్స్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు తెలిసినంత వరకూ ప్రేక్షకులు ఇలాంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ తరహాలో షూట్‌ చేయాల్సి వస్తోంది. అంతేకానీ, ఒక మహిళకు ఇలాంటివి అసౌకర్యంగా ఉంటాయి’’ అని చెప్పుకొచ్చింది.

sruthi hasan comments about sridevi -chiranjeevi song..

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాను కథానాయికగా నటించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లూ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా విడుదల కావడంపై శృతి స్పందిస్తూ.. ” ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లో నటించడం.. అవి రెండూ ఒకేసారి విడుదల కావడం.. ఎంతో ఆనందంగా ఉంది. అవి రెండూ ఒకేసారి విడుదలవుతున్నందుకు ఏమాత్రం భయం లేదు. సెట్‌లో ఉన్నంతసేపు ఎంతో కష్టపడి మా వంతు శ్రమించాం. మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నాం..” అని వివరించింది.