ఇప్పటి ఈ 16 మంది హీరోయిన్లు…చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ సినిమాల్లో నటించారో తెలుసా.?

ఇప్పటి ఈ 16 మంది హీరోయిన్లు…చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ సినిమాల్లో నటించారో తెలుసా.?

by Anudeep

Ads

ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయిన హీరోయిన్లు ఒకప్పుడు ఈ సినిమా లో సైడ్ క్యారక్టర్ చేశారు అని తెలియగానే ఒకింత ఆశ్చర్యపోతాం. అదే., వాళ్ళు చిన్న వయసులో ఉన్నపుడు కూడా సినిమాల్లో నట్టించే అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేశారని తెలిస్తే..? వాళ్ళు ఏమి సినిమాలో చేసారు అన్న ఆసక్తి కలగడం సహజం కదా. మరింకెందుకు ఆలస్యం.. ఏ హీరోయిన్ చిన్నపుడు ఏ సినిమాలో నటించారో ఇపుడు మనం చూసేద్దాం..

Video Advertisement

1. నిత్యా మీనన్

“అలా మొదలైంది” సినిమాతో నాని పక్కన జంట గా తెలుగు తెరకు పరిచయం అయినా నిత్యా తెలుగు వాళ్ళకి బాగానే కనెక్ట్ అయిపొయింది. మలయాళం నటి అయినప్పటికీ, నిత్యా తెలుగు అమ్మాయి పాత్రలో అచ్చం గా ఇమిడిపోతుంది. చిన్నప్పుడే ఈ నటి “ద మనీ హు నో టూ మచ్(1998 )” అనే సినిమాలో నటించి మెప్పించింది.

2. హన్సిక

చిన్న వయసు లోనే వెండితెర కు పరిచయం అయినా హీరోయిన్లలో హన్సిక ఒకరు . ” దేశ ముదురు” సినిమా తో హన్సిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అప్పటికి ఆమె వయసు 19 సంవత్సరాలే. కానీ, అంతకుముందే హన్సిక హృతిక్ రోషన్ తో కలిసి ” కోయీ మిల్ గయా ” అనే సినిమా లో బాలనటి గా మెప్పించింది.

3. శ్రావ్య

జగపతి బాబు “సందడే సందడి” సినిమా గుర్తుందా? అందులో శ్రావ్యని కూడా మీరు గుర్తుపట్టే ఉంటారు. పెద్దయ్యాక ఈ బ్యూటీ “లవ్ యు బంగారం” మూవీ తో హీరోయిన్ గ పరిచయం అయ్యింది.

4. కీర్తిసురేష్

కీర్తి సురేష్ కి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. కానీ సొంతం గా కష్టపడి పైకొచ్చింది. “నేను శైలజ” సినిమాతో తెలుగు వాళ్ళ మెప్పు పొంది..”మహానటి” సినిమా తో అందరి హృదయాలను కొల్లగొట్టింది. కానీ కీర్తి సురేష్ 2000 సంవత్సరం లోనే “పైలెట్స్” మూవీ లో బాల నటిగా నటించి మెప్పించింది. కీర్తి సురేష్ తల్లి మేనకా కూడా ప్రముఖ నటి.

5. శ్రీదివ్య

“మనసారా” సినిమాతో అచ్చ తెలుగింటి ఆడపడచు లా హృదయాలను తాకినా నటి శ్రీ దివ్య. ఆమె హనుమాన్ జంక్షన్ లో నటించిందని తెలుసా.. జగపతిబాబు, అర్జున్ కలిసి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా ని మరోసారి చుడండి. ఓ చిన్నారి మనలని బాగా ఆకట్టుకుంటుంది. ఆమె మరెవరో కాదు, శ్రీదివ్యే.

6. మంజిమ మోహన్

మంజిమ మోహన్ మలయాళ నటి. “సాహసం శ్వాస గా సాగిపో” అనే సినిమా లో నాగ చైతన్యకు జంటగా నటించింది. అంతకుముందే “మధురనంబరకట్టు” అనే సినిమాలో బాల నటిగా మెప్పించి కేరళ స్టేట్ నుంచి ఉత్తమ్ బాల నటి అవార్డుని గెలుచుకుంది.

7. శ్రీయ శర్మ

“జై చిరంజీవ” సినిమా లో చిరు కు మేనకోడలు గా కనిపించిన చిన్నారి గుర్తుందా..? తరువాత ఆమె దూకుడు సినిమా లో సమంత కి చెల్లి గా కూడా కనిపించింది. ఆ తరువాత గాయకుడూ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

8. అంకిత

“సింహాద్రి” సినిమా లో చీమ చీమ పాట లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులేసిన అంకిత గుర్తుందా.. ? “లాహిరి లాహిరి లాహిరిలో ” సినిమాలో హీరోయిన్ గా నటించింది. చిన్నప్పుడే, రస్నా ఆడ్ లో నటించి అంకిత అలరించింది.

9. షాలిని

బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన షామిలి గుర్తుందా ఈమె బాలనటి గా మొత్తం నలభై సినిమాల్లో చేసింది. తెలుగు లో కూడా కధానాయిక గా చేసింది. కానీ, మళయాలం, తమిళ భాషల్లో మొత్తం పది సినిమాల్లో కథానాయిక గా చేసింది.

10. షామిలి

మణిరత్నం అంజలిని ఎవరు మర్చిపోలేరు.. ఆ పాప ఎవరో కాదు షామిలి. షామిలి, షాలిని అక్క చెల్లెల్లు. షామిలి కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిన్నప్పుడే నటించింది. ఆ తరువాత ఓయ్ సినిమా తో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.

11. అనుష్క మల్హోత్రా

డాడీ అంటూ చిరంజీవి ని ముద్దు ముద్దు గా పిలిచినా అనుష్క మల్హోత్రాను అంత త్వరగా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో మోడల్ గా చేస్తోంది. బాలీవుడ్ లో కి వెళ్ళడానికి సరైన ఎంట్రీ కోసం చూస్తోంది.

12. సుహాని

బాల రామాయణం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుహాని ఎంతగానో ఆకట్టుకున్నారు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా 15 సినిమాల్లో నటించారు. 2007 లో సవాల్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.మనసంతా నువ్వే సినిమా లో తూనీగా తూనీగా పాట బేబీ సుహాని కి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది.

13. నిత్యా శెట్టి

దేవుళ్ళు సినిమా లో నటించిన అమ్మాయి నిత్యా శెట్టి గుర్తుందా.. ఆమె ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. మరో వైపు, సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిత్యా శెట్టి తమిళ, తెలుగు సినిమాల్లో కలిపి ఆరు సినిమాల్లో నటించింది.

14. సునైనా

“అమ్మోరు” సినిమా లో దేవత గా కనిపించిన పాప గుర్తుందా? ఆ పాపే సునయన. ఓ బేబీ సినిమా లో కూడా సునైనా ఓ పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. అలాగే, సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉంటూ సొంతం గా వీడియో లు చేసుకుంటోంది.

15. శ్వేతా బసు ప్రసాద్

శ్వేతా బసు ప్రసాద్ కి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. కొత్తబంగారు లోకం వంటి యూత్ ఫుల్ సినిమా తో శ్వేతా చాలా పాపులర్ అయింది. కానీ, శ్వేతా కూడా చిన్నప్పుడే మేకప్ వేస్కుని నటించిందని తెలుసా? 2002 నుంచి 2006 వరకు బాలీవుడ్ లో శ్వేతా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

16. దివ్య నగేష్

అనుష్క అరుంధతి సినిమా లో, చిన్నప్పటి అరుంధతి క్యారక్టర్ చేసిన అమ్మాయి గుర్తుందా ఆమె దివ్య నగేష్. నేను నాన్న… అనే ఒక తెలుగు సినిమా లో దివ్య నగేష్ హీరోయిన్ గా చేసింది.


End of Article

You may also like