సినిమాలలో అడల్ట్ కామెడీ కి సెపరేట్ “A” సర్టిఫికెట్ జోన్ ఉంటుంది. శృతి మించితే సెన్సార్ వారు కత్తెర వేస్తారు. కానీ, బుల్లితెర పై ఆ పరిస్థితి లేదు. కామెడీ షో ల పేరిట ఈ తంతు నిర్విరామం గా కొనసాగుతోంది. జబర్దస్త్, అదిరింది వంటి షో లు తొలుత కామెడీ పంచడం కోసం ప్రారంభం అయ్యాయి. ఈ షో లలో స్కిట్ లు వేసే కంటెస్టెంట్ లు బుల్లితెర వీక్షకులందరికి సుపరిచితులు. వీరిలో చమ్మక్ చంద్ర స్కిట్ లో ఒకప్పుడు ఇష్టపడని వారు ఉండేవారు కాదు.

feature

‘జబర్దస్త్’ వచ్చిన తొలినాళ్లలో చమ్మక్ చంద్ర తనదైన శైలిలో స్కిట్ లతో కామెడీ పండించి ఫామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత క్రమం గా ఆ స్కిట్ లలో ఎక్కడో తేడా కొట్టేసినట్లుంది. ‘అదిరింది’ షో కి మారిన తరువాత కూడా చమ్మక్ చంద్ర అదే ధోరణి లో కొనసాగాడు. ఒక్క చంద్ర స్కిట్ అనే కాదు.. కామెడీ షో లలో వస్తున్న స్కిట్ లలో చాలా వరకు డబల్ మీనింగ్ లు, అసహ్యం పుట్టించే డైలాగులే కనిపిస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటీ ఫామిలీ తో కలిసి కూర్చుని చూసేది గా కనిపించడం లేదు. ఇటీవల కామెడీ స్టార్స్ అని మరో షో ప్రారంభమైంది.

chammak chandra 2

ఇందులోనూ ఇదే తరహా రోత కామెడీ. వెగటు పుట్టించే విధం గా ఉంటున్న నాసిరకం అడల్ట్ కామెడీ డైలాగులే వినిపిస్తున్నాయి. ఇటీవల కామెడీ స్టార్స్ ప్రోమో విడుదల అయింది. ఇందులో ఏకం గా బూతు కామెడీ నే దించేశారు. కంటెస్టెంట్ లే అనుకుంటే.. జడ్జిలు సైతం ఆ బూతు కామెడీ కి పడి పడి నవ్వుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రోమో లో చూపిన ఓ స్కిట్ లో చమ్మక్ చంద్ర మసాజ్ చేసే భర్త గా కనిపించదు. తన భార్య కు మసాజ్ చేస్తూ.. ఎలా ఉంది అని అడుగుతాడు. అందుకు సమాధానం గా “ఎందుకు బాగోదు చాలా బాగుంటుంది” అంటూ శేఖర్ మాస్టర్ కౌంటర్ వేసి పడి పడి నవ్వాడు.

chammak chandra 3

ఇంతలో పక్కింట్లో వాళ్ళ ఆవిడ కు కూడా చంద్ర మసాజ్ చేసాడు. ఆ లేడీ గెటప్ లో ఉన్న కంటెస్టెంట్ డైలాగులు మరీ దారుణం.. “మీరలా పిసుకుతుంటే సమ్మగా ఉంది” అంటుంటే ఇది కామెడీ నా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈలోగా ఆ మహిళా భర్త వచ్చి ఒరేయ్ నా పెళ్ళాన్ని పిసుకుతావ్ ఏంట్రా అంటూ అడుగుతాడు. “మీరు ఉండండి.. మీరు పిసకండి” అంటూ ఆ లేడీ కంటెస్టెంట్ డైలాగ్ వేయడం బూతు కే పరాకాష్ట గా కనిపిస్తుంది.

“వీడు పిసకడు.. పిసికే వాళ్లని పిసకనివ్వడు.. మా ఆయన స్నానానికి వెళ్లాడు.. ఈ గ్యాప్‌లో కానిచ్చేద్దామా” అంటూ లేడీ కంటెస్టెంట్ తో డైలుగులు చెప్పించడం చూస్తుంటే.. ఈ అడల్ట్ కామెడీ బుల్లితెరపై ఎంత యథేచ్ఛగా పండిస్తున్నారో తెలుస్తోంది. దీనిని చూసి కామెడీ అని జడ్జి లు పడి పడి నవ్వుతుంటే.. రెండు చేతులు జేబులోకి పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోవాలనిపిస్తుంది.

watch video:

Also watch: