ఒక సాధారణ వ్యక్తి హీరో అవ్వాలి అనుకుంటే..? కొత్తగా రిలీజ్ అయిన ఈ సినిమా చూశారా..?

ఒక సాధారణ వ్యక్తి హీరో అవ్వాలి అనుకుంటే..? కొత్తగా రిలీజ్ అయిన ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

సాధారణంగా చాలా మంది తమిళ హీరోలకి తెలుగులో కూడా అభిమానులు ఉంటారు. తమిళ సినిమాలు ఇతర భాషల్లో విడుదల అయినా, అవ్వకపోయినా కూడా తెలుగులో మాత్రం విడుదల చేస్తారు. అందుకు కారణం తెలుగు ప్రేక్షకులు ఎలాంటి భాష కంటెంట్ అయినా కూడా ఆదరిస్తారు. కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అని అదే సినిమాని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తారు. చాలా మంది యంగ్ తమిళ్ హీరోలు కూడా తెలుగులో తమ మార్కెట్ పెంచుకోవడానికి సుముఖత చూపిస్తారు. ఎందుకంటే, తెలుగులో ఏ భాష సినిమాని అయినా ఆదరిస్తారు అనే ఒక నమ్మకం అందరికీ ఉంటుంది. అది నిజం.

Video Advertisement

star movie amazon prime review telugu

అలా తెలుగులో ఒక తమిళ్ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల థియేటర్ రిలీజ్ ఆగిపోయింది. ఆ సినిమా పేరు స్టార్. గత నెల విడుదల అయిన ఈ సినిమా, తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులోకి డబ్బింగ్ ద్వారా విడుదల చేస్తారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా తమిళ్ తో పాటు, తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. డాడా సినిమా ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కవిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి, ఏలన్ దర్శకత్వం వహించారు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ గారు, శ్రీనిధి సాగర్ ఈ సినిమాని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

లాల్, ప్రీతి ముకుందన్, అదితి పోహంకర్ ఈ సినిమా లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కళైరసన్ అలియాస్ కళై (కవిన్) హీరో అవుదామని చిన్నప్పటినుంచి కలలు కంటూ ఉంటాడు. దాని కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతని తండ్రి పాండియన్ (లాల్) కళైకి మద్దతు ఇస్తూ ఉంటాడు. పాండియన్ ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్. కళై తల్లి మాత్రం, సినిమాలు వద్దు చదువుకోమని చెప్తూ ఉంటుంది. ఒకే ఒక్క ప్రమాదం వల్ల కళై హీరో అవుదాం అనే ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత కళై మళ్లీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టి హీరో అయ్యాడా అనేది కథ.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా ఎమోషనల్ గా ఉండే అంశాలని యాడ్ చేశారు. కొంత మందికి ఇవి అంతగా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి. బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం సినిమాకి ప్రధాన బలం. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాలో జరిగే సంఘటనలు అన్నిటినీ కూడా క్లైమాక్స్ ద్వారా వివరంగా చెప్పారు. స్లో స్క్రీన్ ప్లే ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ సినిమాని తప్పకుండా చూడండి. ఒక వ్యక్తి జీవితాన్ని ఈ సినిమాలో చూపించారు.


End of Article

You may also like