Ads
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ మొదటి సినిమా ‘పోడా పోడీ’ నుండి మొన్నటి సూర్య ‘గ్యాంగ్’ వరకూ తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కె. ఆర్. కె.. కన్మణి రాంబో ఖతీజా కూడా తెలుగు డబ్ అయింది.
Video Advertisement
విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత కలిసి నటించిన తెలుగు డబ్బింగ్ చిత్రం కె. ఆర్. కె. ముగ్గురు స్టార్ యాక్టర్స్ కలిసి స్క్రీన్ ను పంచుకోవడంతో చాలామంది ఈ చిత్రం కోసం ఎదురు చూసారు.
అయితే.. ఈ చిత్రం థియేటర్ లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కానీ ఓటీటీలో పర్వాలేదు అనిపించింది. కె ఆర్ కె.. ఓ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అయినప్పటికీ సమంత, విజయ్ సేతుపతిని ప్రేమించడానికి ముందు తనకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతన్ని మీరు గుర్తుపట్టారా!? అతనే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ లో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. భజ్జీ, శ్రీశాంత్ ఇష్యూ ఐతే అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం క్రికెట్ కు దూరంగా ఉన్న శ్రీ “ఆక్సర్ 2” తో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.
తాజాగా కె ఆర్ కె లో సమంత బాయ్ ఫ్రెండ్ గా మహమ్మద్ మోబి పాత్రలో నటించాడు శ్రీశాంత్. ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ప్రేక్షకులు శ్రీని గుర్తు పట్టలేదు. వివాహం అనంతరం నయన్, విఘ్నేష్ సినిమాలకు కొంత విరామం ఇవ్వగా, విజయ్ సేతుపతి ఇటీవలే విక్రమ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే మేరీ క్రిస్మస్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండగా సమంత యశోద, ఖుషి సినిమాల్లో బిజీ బిజీ గా ఉంది.
End of Article