బాహుబలి సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మరో కథ రాసారు. “సీత” కోణం లో ఈ కథ సాగుతూ ఉంటుందట. విజయేంద్ర ప్రసాద్ కథ అనగానే సహజం గానే ఆసక్తి రేకెత్తుతుంది. వాస్తవానికి.. మొదట ఈ కథ కోసం కరీనా కపూర్ ను సీత గా తీసుకోవాలని భావించారు. చాల వరకు ఖరారు అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ.. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం తో ఆమెను తీసుకోవాలన్న ఆలోచనను కూడా మానుకున్నారు.

aiswarya rai

ఇది ఇలా ఉంటె.. సోషల్ మీడియా లో కంగనా ను తీసుకోవాలంటూ నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమం లో నిర్మాతలు ఆలోచించుకున్నారు. కానీ.. కంగనా ను తీసుకోవడానికి వారు సిద్ధం గా లేరని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకోసం మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ ను తీసుకోవాలని యోచిస్తున్నారట. సినిమాకు ఫుల్ క్రేజ్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ సంగతి ఎంతవరకు వెళ్తుందో చూడాలి..