“ఆస్కార్” రావాలి అంటే పాటించాల్సిన 4 నియమాలు..! ఇంత కఠినంగా ఉన్నాయి ఏంటి..?

“ఆస్కార్” రావాలి అంటే పాటించాల్సిన 4 నియమాలు..! ఇంత కఠినంగా ఉన్నాయి ఏంటి..?

by Anudeep

Ads

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు.

Video Advertisement

ఈ నేపథ్యం లో నాటు నాటు ఆ ఘనతని సాధించింది. భారతీయ సినీ చరిత్రలో.. ఎప్పటికీ ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ పటాపంచలు చేసింది.

రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం లోని ‘నాటు నాటు…’ ఆస్కార్ అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. తెలుగు పాటని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అసలు ఆస్కార్ అవార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారో తెలుసుకోవాలి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ అందుకోవాలంటే.. సినిమాలు ఎలా ఉండాలి? ఒక ఇండియన్ సినిమాను ఆస్కార్ బరిలో నిలబెట్టాలంటే ఎలాంటి పద్ధతులు/షరతులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

how to make promotions for oscar..!!
#1 హాలీవుడ్ చిత్రాలు ఆస్కార్ నామినేషన్ కి పోటీ పడాలి అంటే.. ఆ సినిమా డైరెక్టర్ కానీ.. నిర్మాత కానీ అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్& సైన్సెస్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అదే విదేశీ చిత్రాలకు అయితే వేరే నిబంధనలు ఉంటాయి.

#2 మన సినిమాలకు ఆస్కార్స్ లో ‘బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ కేటగిరిలో అవకాశం ఉంటుంది. ఏ దేశం నుండైనా ఆస్కార్ కి ఒక సినిమా ఎంపిక అవ్వాలంటే.. రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ప్రభుత్వమే తమ దేశం తరపున ఆస్కార్ కొట్టే ఛాన్స్ దానికి ఉందని ఓ సినిమాను ఎంపిక చేసి ఆఫీషియల్ గా పంపిస్తుంది. మన దేశంలో సినిమాలను ఆస్కార్ కి పంపేందుకు ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(FFI)’ కమిటీ ఉంటుంది.

how to make promotions for oscar..!!

ఇండియా నుండి ఆస్కార్ కి అధికారికంగా వెళ్లాల్సిన సినిమాలేవో వారే నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఆస్కార్ రేసులోకి ఇండియా నుండి గుజరాతీ మూవీ చెల్లో షో అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది. ఇవి కాకుండా రెండో మార్గం.. జనరల్ కేటగిరి. దీనికి ఎవరైనా తమ సినిమాలను సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ.. ఇక్కడ కొన్ని షరతులు ఉంటాయి.

  • సినిమా ఆ ఏడాది జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపే రిలీజ్ అయ్యుండాలి.
  • సినిమా ఖచ్చితంగా యూఎస్ లోని మెట్రో నగరాలలో మినిమమ్ వారం రోజులైనా థియేట్రికల్ రన్ అయ్యుండాలి.
  • సినిమా రన్ టైమ్ 40 నిమిషాలకు పైనే ఉండాలి.
  • మూవీని 35mm లేదా 70mm ఫార్మాట్ లో తీసుండాలి.
  • ఫారెన్ మూవీ అయితే.. ఆడియో ట్రాక్ లో మినిమమ్ 50% పదాలు వేరే లాంగ్వేజ్ వి ఉండాలి. అలాగే సబ్ టైటిల్స్ ఉండాలి.

#3 ఇక ఇలా అన్ని నిబంధనలకు లోబడి ఎలిజిబుల్ అయిన సినిమాలను ఆస్కార్ వాళ్ళు ‘ఆస్కార్ రిమైండర్ లిస్ట్’ అని రిలీజ్ చేస్తారు. ఈ లిస్ట్ కేవలం అర్హత కలిగినవి అని చెప్పడానికి మాత్రమే. ఆస్కార్ నామినేషన్స్ కి, ప్రమోషన్స్ కి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా ఖర్చు తో కూడుకున్న పని.

how to make promotions for oscar..!!

నామినేషన్స్ లో ఉన్న చిత్రాల కోసం భారీ స్థాయిలో కాంపైన్ చెయ్యాల్సి ఉంటుంది. ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టాలి.

2016 లో వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ‘విచారణై’ సినిమా ఇండియా తరపున ఆస్కార్ కి ఎంపికైంది. ఆ సమయం లో ఏం జరిగిందో వెట్రిమారన్ గతం లో ఒకసారి పంచుకున్నారు. ” ఆస్కార్ నామినేషన్ కి సినిమా షార్ట్ లిస్ట్ అయిన తరువాత రెండు నెలలు ముందు లాస్ఏంజిల్స్ లో ఉండాలి. ఆ ఖర్చులన్నీ మనవే. ముందుగా కాంపైన్ కోసం మంచి పీఆర్ ని పెట్టుకోవాలి. అటువంటి వారు దొరకడం కష్టం. నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రమోషన్స్ కే 12 లక్షలు ఖర్చు అవుతాయి. నామినేట్ అయితే మరో నాలుగు లక్షలు ఖర్చవుతాయి. ఇది కేవలం పీఆర్ కి మాత్రమే.

అంతే కాకుండా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ చాలా విందులు ఏర్పాటు చెయ్యాలి. అక్కడి ప్రముఖ పత్రికలైన ‘వెరైటీ’, ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ వంటి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. దీనికి కొన్ని వేల డాలర్లు ఖర్చు అవుతాయి. వాటికీ సుమారు 26 లక్షలు ఖర్చు అయ్యాయి. ఆ తర్వాత అతిధులను ఆహ్వానించి వారికీ సినిమా చూపించాలి. దాని కోడం థియేటర్ అద్దెకు తీసుకోవడం.. వారికీ మర్యాదలు చేయడం మన ఖర్చులే..” అని వెట్రిమారన్ చెప్పారు. ఇవి 2016 నాటి ఖర్చులు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ దీనికోసం 80 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం.

how to make promotions for oscar..!!

ఒక సినిమా విడుదలకు ముందు మార్కెటింగ్, ప్రమోషన్స్ ఎలా చేస్తామో.. ఆస్కార్ కి కూడా అలాగే చెయ్యాలి. కానీ అది విదేశం.. అలాగే డబ్బులు డాలర్లు లో ఉంటాయి కాబట్టి మనకి తలకి మించిన భారమే.. వీటి కోసం సుమారుగా 120 కోట్ల కు పైగా ఖర్చు అవుతుందని సమాచారం. దీంతో ఆస్కార్ ప్రమోషన్స్ పై పెట్టే ఖర్చుపై పరిమితులు పెట్టాలని హాలీవుడ్ లో డిమాండ్స్ వస్తున్నాయి.

#4 ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే..??

జనరల్ గా ఆస్కార్ లో ఏ కేటగిరి అయినా 5 నామినేషన్స్ వరకే ఫైనల్ చేస్తారు. కానీ.. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో 10 నామినేషన్స్ వరకు ఛాన్స్ ఇస్తారు. ముందుగా రిమైండర్ లిస్ట్ లో ఉన్న అన్నీ సినిమాలకు.. అన్నీ కేటగిరీల ఆస్కార్ మెంబర్స్ ఓటింగ్స్ వేస్తారు. అలా మల్టీపుల్ రౌండ్స్ అయ్యాక.. నామినేషన్స్ లో పోటీపడే 5 సినిమాలను ఫైనల్ చేస్తారు. ఇక విన్నర్ ఎవరో తెలియాలి కదా.. అందుకోసం మొత్తం వేల సంఖ్యలో ఉన్న ఓటింగ్ మెంబర్స్ మరోసారి ఫైనల్ ఓటింగ్ వేస్తారు.

how to make promotions for oscar..!!

ఆస్కార్ లో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. ఈ ఏడాది అకాడమీ లో సుమారు పదివేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులు ఓటర్లు గా ఉంటారు. మొదట నామినేషన్స్ కోసం ఓట్లు వేస్తారు. ఏ విభాగానికి చెందిన వారు వాటికే ఓటు వేస్తారు. ఇక వాటి ఆధారం గా విజేతను నిర్ణయిస్తారు.


End of Article

You may also like